క్రూడాయిల్  గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో దాని ధరలలో  పెరుగుదల నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 95.83 డాలర్ల  స్థాయికి చేరుకుంది. WTI ధర కూడా బ్యారెల్‌కు  $ 88.09 డాలర్ల వద్ద ఉంది. 

న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర గత 24 గంటల్లో మళ్ళీ పెరిగింది. ఇదిలా ఉండగా గురువారం ఉదయం ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను విడుదల చేశాయి. ఈ రోజు కూడా ఢిల్లీ-ముంబై వంటి దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో ఎటువంటి మార్పు లేదు.

అయితే చాలా నగరాల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో కాస్త హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. నేడు యూపీలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో (నోయిడా-గ్రేటర్ నోయిడా) పెట్రోల్ ధర 6 పైసలు తగ్గి రూ.96.58కి, డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గి రూ.89.75కి చేరుకుంది. మరోవైపు బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర రూ.108కి పైగా పెరిగింది. ఇక్కడ ఈ ఉదయం లీటర్ పెట్రోల్ ధర రూ.108.12కి చేరుకుంది. డీజిల్ ధర కూడా లీటరుకు రూ.94.86కి చేరింది.

క్రూడాయిల్ గురించి మాట్లాడినట్లయితే గత 24 గంటల్లో దాని ధరలలో పెరుగుదల నమోదైంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు దాదాపు 95.83 డాలర్ల స్థాయికి చేరుకుంది. WTI ధర కూడా బ్యారెల్‌కు $ 88.09 డాలర్ల వద్ద ఉంది.

నాలుగు మెట్రోలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకు రూ. 89.62 
- ముంబైలో పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 94.24, డీజిల్ ధర లీటరుకు రూ. 92.76

ఈ నగరాల్లో ధరలు మారాయి
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.58, డీజిల్ ధర లీటరుకు రూ. 89.75.
- లక్నోలో లీటరు పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76గా ఉంది.
-పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.12, డీజిల్ ధర రూ.94.86గా ఉంది.
-ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్ ధర రూ.89.75గా ఉంది.
-హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

ప్రతి రోజు ఉదయం 6 గంటలకు కొత్త ధరలు
ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పు ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.