- Home
- Business
- రూపాయి పెట్టుబడి అవసరం లేదు.. ఇల్లు కదలాల్సిన పనిలేదు. ఉద్యోగాన్ని మించిన ఆదాయం పొందే మార్గాలు
రూపాయి పెట్టుబడి అవసరం లేదు.. ఇల్లు కదలాల్సిన పనిలేదు. ఉద్యోగాన్ని మించిన ఆదాయం పొందే మార్గాలు
Business Ideas: పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే డిజిటల్ ప్రపంచం మీకు బోలెడు అవకాశాలు ఇస్తోంది. దీనికోసం పెద్దగా డబ్బు, ఆఫీస్ వంటివి కూడా అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే ఆదాయం పొందే కొన్ని మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
14

Image Credit : Gemini AI
పెట్టుబడి లేకుండానే ఆదాయం
ఈ డిజిటల్ యుగంలో, పెట్టుబడి లేకుండా వ్యాపారం చేయాలనుకునే యువతకు చాలా అవకాశాలున్నాయి. టాలెంట్, క్రియేటివిటీ ఉంటే చాలు, ఇంట్లో నుంచే డబ్బు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

24
Image Credit : AI Generated
పెట్టుబడి లేని వ్యాపారం
ఫ్రీలాన్సింగ్ ద్వారా కంటెంట్ రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డేటా ఎంట్రీ వంటి పనులు చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. దీనికి ఒక కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లయింట్లతో పనిచేసే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం కేవలం ఇంగ్లిష్ మాత్రమే కాకుండా తెలుగు కంటెంట్ రైటర్స్ కి కూడా డిమాండ్ పెరుగుతోంది.
34
Image Credit : Gemini AI
సోషల్ మీడియా మేనేజర్లు
చిన్న కంపెనీలకు సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ చేసే వారి అవసరం బాగా పెరుగుతోంది. పోస్టులు క్రియేట్ చేయడం, కామెంట్లకు రిప్లై ఇవ్వడం, ఫాలోవర్లను పెంచడం వంటి సేవలు అందిస్తూ నెలనెలా ఆదాయం పొందవచ్చు.
44
Image Credit : Getty
కంప్యూటర్ కోర్సులు
ఆన్‌లైన్ ట్యూషన్ ద్వారా పాఠాలు, భాషలు, కంప్యూటర్ కోర్సులు నేర్పించవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఈ కామర్స్ సైట్ల వస్తువులను ప్రమోట్ చేసి కమీషన్ పొందొచ్చు. యూట్యూబ్ లేదా షార్ట్ వీడియో కంటెంట్ క్రియేట్ చేసి, యాడ్స్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. చిన్న ప్రయత్నమే పెద్ద ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
Latest Videos

