Asianet News TeluguAsianet News Telugu

గుడ్ న్యూస్...రూ.8తగ్గిన పెట్రోల్ ధర

వాహనదారులకు చమురు కంపెనీలు శుభవార్త తెలియజేశాయి.  రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 

Petrol, diesel price see a sharp cut again today. Check rates here
Author
Hyderabad, First Published Nov 23, 2018, 2:20 PM IST

వాహనదారులకు చమురు కంపెనీలు శుభవార్త తెలియజేశాయి.  రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కాగా..  శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు మరికాస్త తగ్గాయి. దీంతో అక్టోబరు 18 నుంచి నవంబరు 23 వరకు పెట్రోల్‌ ధర ఇప్పటి వరకు రూ. 8.43 తగ్గింది.

దేశ రాజధానిలో శుక్రవారం పెట్రోల్‌పై 40 పైసలు తగ్గి లీటర్‌ ధర రూ. 75.57గా ఉంది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబయిలో లీటర్ పెట్రోల్‌ ధర రూ. 81.50, కోల్‌కతాలో రూ. 77.53, చెన్నైలో రూ. 78.46, హైదరాబాద్‌లో రూ. 80.12గా ఉంది.

డీజిల్‌ కూడా నేడు రూ. 41పైసలు తగ్గి దిల్లీలో లీటర్‌ ధర రూ. 70.56గా ఉంది. ముంబయిలో రూ. 73.91, కోల్‌కతాలో రూ. 72.41, చెన్నైలో రూ. 74.55, హైదరాబాద్‌లో రూ. 76.77గా ఉంది. అక్టోబర్‌ 4న పెట్రోలు ధర రికార్డు స్థాయిలో దిల్లీలో లీటర్‌కు రూ.84కు చేరగా, ముంబయిలో రూ.91.34కు చేరింది. అదేరోజు డీజిల్‌ అత్యున్నతస్థాయిలో దిల్లీలో రూ.75.45, ముంబయిలో రూ.80.10కి చేరింది. 

Follow Us:
Download App:
  • android
  • ios