Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు.. మీ నగరంలో నేడు ఒక లీటరు ధర ఎంతో చెక్ చేసుకొండి..

గతేడాది ఫిబ్రవరి 2022లో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా రికార్డు స్థాయికి చేరిన క్రూడాయిల్  ఇప్పుడు బ్యారెల్‌కు 75 డాలర్లకు పడిపోయింది.
 

Petrol  Diesel Fresh Prices Announced June 3: Check Latest Fuel Rates In Your City-sak
Author
First Published Jun 3, 2023, 9:41 AM IST | Last Updated Jun 3, 2023, 9:51 AM IST

న్యూఢిల్లీ: ఈరోజు అంటే 3 జూన్ 2023న దేశంలో పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లు సవరించబడ్డాయి. ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు అప్‌డేట్ చేస్తాయి. దింతో దేశ రాజధాని న్యూఢిల్లీ సహా ఇతర మెట్రో నగరాల్లో నేటికీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు, అయితే కొన్ని నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.  గత ఏడాది కాలంగా జాతీయ స్థాయిలో పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

క్రూడాయిల్ ధర ?

గతేడాది ఫిబ్రవరి 2022లో మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో క్రూడాయిల్  ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫలితంగా రికార్డు స్థాయికి చేరిన క్రూడాయిల్  ఇప్పుడు బ్యారెల్‌కు 75 డాలర్లకు పడిపోయింది.

క్రూడాయిల్ గత కొన్ని నెలలుగా మళ్లీ విజృంభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర మరోసారి బ్యారెల్‌కు 75 డాలర్లు దాటింది. క్రూడ్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $1.85 లేదా 2.49% పెరిగి $76.13కి, WTI క్రూడ్ $1.64 లేదా 2.34% పెరిగి బ్యారెల్ $71.74కి చేరుకుంది.

చమురు కంపెనీలు క్రూడాయిల్  ధరల ఆధారంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను విడుదల చేస్తాయి. ఇందులో పన్నులు, రవాణా ఖర్చులు, సరుకు రవాణా ఛార్జీలు ఉంటాయి. 

న్యూఢిల్లీ గురించి మాట్లాడితే, ఇక్కడ పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ లీటరు ధర రూ. 89.62. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.106.03, డీజిల్‌ ధర రూ.92.76. చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.65, డీజిల్ ధర రూ.94.25కు లభిస్తోంది. 

గౌతమ్ బుద్ నగర్ (నోయిడా-గ్రేటర్ నోయిడా)లో పెట్రోల్ ధర రూ.96.79గా ఉండగా, డీజిల్ లీటరు ధర రూ.89.96గా ఉంది. లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57.  గురుగ్రామ్‌లో పెట్రోల్ లీటరు ధర రూ.97.18గా ఉంది. అయితే, హర్యానా రాజధాని నగరంలో డీజిల్ లీటర్ ధర రూ. 90.05గా ఉంది.

హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

మీరు మీ నగరంలో ఇంధన ధరను చెక్  చేయడానికి SMS సౌకర్యం ఉపయోగించవచ్చు. ఇండియన్ ఆయిల్ ఇంధన ధరలను తెలుసుకోవడానికి మీరు RSP < డీలర్ కోడ్ > అని టైప్ చేసి 9224992249కి SMS పంపాలి, HPCL కస్టమర్లు HPPRICE < డీలర్ కోడ్ > అని 9222201122కి టైప్ చేసి  పంపాలి, BPCL కస్టమర్లు < డీలర్ కోడ్ > అని టైప్ చేసి 9223112222కి SMS పంపాలి. దీని తర్వాత చమురు కంపెనీలు మీ నగరంలోని తాజా ధరలను మీ మొబైల్‌కు పంపుతాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios