న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు  రోజురోజుకి పెరిగి తార స్థాయికి చేరుతున్నాయి. వరుసగా 17 వ రోజు కూడా భారతదేశం అంతటా ఇంధన ధరలను మళ్ళీ పెంచాయి. నేడు పెట్రోల్ పై లీటరుకు 20పై పెరగగా, డీజిల్ పై లీటరుకు 55 పైసల పెరిగి, ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది.

దాదాపు 82 రోజుల లాక్ డౌన్ తరువాత జూన్ 7 నుంచి నేటి వరకు మొత్తంగా పెట్రోల్ ధర పై లీటరుకు రూ.8.50పై పెరిగింది, డీజిల్ ధరపై ప్రస్తుతము రూ.10.01 పెరిగింది.

దేశ రాజధాని ఢిల్ల్లీలో ఇంధన ధరలు వాహన దారులకి చెమటలు పట్టిస్తున్నాయి. ఢిల్లీలో మాత్రం  పెట్రోల్‌తో సమానంగా డీజిల్ ధర చేరింది. ఒక లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 79.76 ఉండగా, డీజిల్ ధర రూ.79.40 ఉంది. ఈ రెండిటికి కేవలం 36 పైసలు తేడా మాత్రమే ఉంది.

అంతర్జాతీయ బెంచ్మార్క్ రేట్ల కారణంగా, పెట్రోల్ ధర సాధారణంగా డీజిల్ ధర కంటే 5-8 రూపాయలు అధికంగా ఖర్చవుతుంది. ఎందుకంటే వాణిజ్య పరిశ్రమలు, వస్తువుల రవాణాదారులు విస్తృతంగా డీజిల్  ఉపయోగిస్తున్నారు.

also read చైనాకు ఆల్టర్నేటివ్ గా ఇతర దేశాలు.. ఎలక్ట్రానిక్స్‌ గూడ్స్‌ దిగుమతికి మలేషియా, తైవాన్ ...

ఢిల్లీలో ఇంధనా ధరలు మే నెలలో లీటరుకు 7.30పైల తేడా ఉండేధి, కాని రాష్ట్ర ప్రభుత్వం రెండు ఇంధనాలపై వాల్యూ ఆధారిత పన్ను (వ్యాట్) ను పెంచిన తరువాత ధరలలో మార్పు చోటుచేసుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు సమానంగా చేరుకున్నాయి.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పెట్రోల్ పై వ్యాట్ 27% నుండి 30% కి, డీజిల్ పై వ్యాట్ 16.75% నుండి 30% కి పెంచింది. వ్యాట్ పెంపు తరువాత, ఢిల్లీలో డీజిల్ ధరపై లీటరుకు రూ.7.10, పెట్రోల్ ధర పై లీటరుకు రూ.1.67 పెరిగింది.


అగ్ర నగరాల్లో తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి:

న్యూ ఢిల్లీ: పెట్రోల్ ధర రూ.79.76. డీజిల్ ధర రూ.79.40

గుర్గావ్: పెట్రోల్ ధర రూ.77.99. డీజిల్ ధర రూ. 71.76

ముంబై: పెట్రోల్ ధర రూ.86.54. డీజిల్ ధర రూ. 77.76

చెన్నై: పెట్రోల్ ధర రూ.83.04. డీజిల్ ధర రూ. 76.77

హైదరాబాద్: పెట్రోల్ ధర రూ.82.79. డీజిల్ ధర రూ. 77.60

బెంగళూరు: పెట్రోల్ ధర రూ. 82.35. డీజిల్ ధర రూ. 75.51