Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 4వ రోజు కూడా పెరిగిన ఇంధన ధరలు... మీ నగరంలో పెట్రోల్ ధర ఎంతో తెలుసుకోండి..

ప్రభుత్వ చమురు కంపెనీలు నేడు వరుసగా 4వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు సవరించాయి. దీంతో పెట్రోల్ ధర 25 నుంచి 28 పైసలకు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 30 నుంచి 33 పైసలు పెరిగింది.

Petrol and diesel prices rise for fourth consecutive day in a row Check todays rates in top cities
Author
Hyderabad, First Published May 7, 2021, 11:01 AM IST

న్యూ ఢీల్లీ: గత 18 రోజుల విరామం తరువాత రాష్ట్ర నియంత్రణలో ఉన్న చమురు మార్కెటింగ్ సంస్థలు (ఒఎంసి)  శుక్రవారం (మే 7) వరుసగా నాలుగో రోజు దేశవ్యాప్తంగా ఇంధన ధరలను సవరించారు. దీంతో పెట్రోల్ పై  25-28 పైసలు, డీజిల్  పై 30-33 పైసలు  పెంచారు.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్‌సైట్ గణాంకాల ప్రకారం ఢీల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ .90.99 నుండి 28 పైసల పెంపుతో రూ .91.27కు చేరుకుంది. డీజిల్ ధర లీటరుకు రూ .81.42 నుండి 31పైసల పెంపుతో  రూ .81.73కు పెరిగింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే, గత నాలుగు రోజులలో పెట్రోల్ ధర లీటరుకు 82 పైసలు, డీజిల్‌పై రూ.1 పెరిగాయి.

ముంబైలోని  గురువారం ఉన్న పెట్రోల్  ధర కంటే 27 పైసలు పెంపుతో  లీటరు పెట్రోల్‌కు రూ.97.61 చెల్లించాలి. డీజిల్ ధర లీటరు రూ .88.82, నిన్నటి ధర లీటరుకు రూ .88.49 అంటే 33 పైసలు పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర   27 పైసలు పెంపుతో లీటరుకు రూ.91.41, డీజిల్ ధర లీటరుకు రూ .84.57.

also read రికార్డ్ స్థాయి నుండి 9 వేలు పడిపోయిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే ? ...

ప్రధాన మెట్రోలలో ఇంధన  ధరలు
 నగరం        పెట్రోల్ (రూ. / లీటరు)   డీజిల్ (రూ. / లీటరు)
 ఢీల్లీ                   91.27                               81.73
 కోల్‌కతా             91.41              84.57
 ముంబై              97.61            88.82
 చెన్నై                93.15                  86.65
 బెంగళూరు        94.30                 86.64
 హైదరాబాద్      94.86                 89.11
 భోపాల్             99.28                  90.01
 జైపూర్              97.65                 90.25
 పాట్నా              93.52                               86.94
 నోయిడా            89.44                                82.18


  రాజస్థాన్ తో సహ పలు రాష్ట్రాల్లో ఇంధన ధరలు  రూ.100కి దాటేసింది. పెట్రోల్, డీజిల్ యొక్క పంపు ధరలు బ్రెంట్ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి, ఎందుకంటే భారతదేశం ఇంధన అవసరాల కోసం 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. కేంద్ర, రాష్ట్ర పన్నులు పెట్రోల్ ధరలో 61 శాతానికి పైగా, డీజిల్ 56 శాతానికి పైగా ఉన్నాయి. కేంద్రం పెట్రోల్‌పై లీటరుకు రూ .32.9, డీజిల్‌పై రూ .11.80 విధిస్తుంది.

 శుక్రవారం, అంతర్జాతీయ చమురు మార్కెట్లో ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, అమెరికా, ఐరోపాలో ప్రయాణ పరిమితిని సడలించడం వలన మునుపటి సెషన్లో 1 శాతం తగ్గిన తరువాత బ్రెంట్ ముడిచమురు ధరలు పెరిగాయి. ఇంధన డిమాండ్ దృక్పథాన్ని ఎత్తివేసింది.

 అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్కు  68.17 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) ముడి ఫ్యూచర్స్ జూన్ లో 9 సెంట్లు పెరిగి 64.80 డాలర్లకు చేరుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios