దేశ రాజధాని  ఢీల్లీలో పెట్రోల్ ధర  లీటరుకు రూ .93.44 చేరుకోగా, డీజిల్ ధర లీటరుకు రూ .84.32 చేరింది. ముంబైలో  సెంచరీకి దగ్గరగా పెట్రోల్ ధర రూ .99.71, డీజిల్ ధర లీటరుకు రూ .91.57గా ఉంది.

కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంధన ధరలు రికార్డు స్థాయిలో రూ.100 దాటింది. ఈ నెలలో ధరలు పెరగటం ఇది పదమూడోసారి. గత మూడు వారాలుగా మొత్తంగా లీటరు పెట్రోల్‌ ధర. 3.04, డీజిల్‌ ధర 3.59 పెరిగాయి.

 ప్రధాన మెట్రోలలో ఇంధన ధరలు క్రింది విధంగా ఉన్నాయి.

also read జాగ్రత్త: జూన్ 1 నుండి చెక్ పేమెంట్ నియమాలలో మార్పు.. దాని గురించి పూర్తిగా తెలుసుకోండి ...

నగరం    డీజిల్    పెట్రోల్
ఢీల్లీ         84.32    93.44
ముంబై    91.57    99.71
కోల్‌కతా    87.16    93.49
చెన్నై    89.11    95.06
హైదరాబాద్‌     91.92   97.12

ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తుంటారు. కొత్త ధరలు ఉదయం 6 నుండి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, ఇతర జోడించిన తరువాత దాని ధర దాదాపు రెట్టింపు అవుతుంది.

ఈ ప్రమాణాల ఆధారంగా, చమురు కంపెనీలు ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి 

 పెట్రోల్, డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, మీరు ఆర్‌ఎస్‌పి అండ్ మీ సిటీ కోడ్‌ను వ్రాసి 9224992249 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపాలి. ప్రతి నగరానికి కోడ్ భిన్నంగా ఉంటుంది.