పెప్సికో నిర్వహణ సవాలే: రామన్ లాగుర్టాకు ‘ఇంద్రానూయి’ కష్టాలు?!

Pepsi's Indra Nooyi leaves us feeling a bit flat
Highlights

కార్పొరేట్ రంగంలో సంచలనం.. భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత.. ఇంద్రానూయి.. భారత సంతతికి చెందిన అమెరికన్‌గా శీతల పానీయాల సంస్థ ‘పెప్సికో’ సీఈఓగా చరిత్ర స్రుష్టించారు. కానీ సీఈఓగా వైదొలుగనున్నట్లు ఇంద్రానూయి ప్రకటించడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి

న్యూఢిల్లీ: కార్పొరేట్ రంగంలో సంచలనం.. భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత.. ఇంద్రానూయి.. భారత సంతతికి చెందిన అమెరికన్‌గా శీతల పానీయాల సంస్థ ‘పెప్సికో’ సీఈఓగా చరిత్ర స్రుష్టించారు. కానీ సీఈఓగా వైదొలుగనున్నట్లు ఇంద్రానూయి ప్రకటించడం వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. పలు కన్జూమర్ గూడ్స్ గ్రూపుల్లో ఒకటిగా పెప్సికో ఉంది. కానీ ఆరోగ్యకరమైన వస్తువులు, స్థానికంగా లభించే ట్రెండ్ సరుకులతో పోటీ పడటంలో వెనుకపడుతున్న సంస్థ పెప్సికో కొంతకాలంగా ప్రగతి సాదనలో వెనుకబడుతోంది.

దీనికి తోడు శీతల పానీయాలకు సంబంధించి పెప్సికోకు ప్రధాన సమస్య ఎదురవుతోంది. శీతల పానీయాల్లో ‘సోడా’ వినియోగం 30 ఏళ్ల నాటికి కనిష్ట స్థాయికి పడిపోయింది. షుగరీ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయ శీతల పానీయాల కోసం అన్వేషణ సాగుతోంది. ఇంద్రానూయి తన హయాంలో డెయిరీ ఆల్టర్నేటివ్స్‌లో ఒక్కటైన వైట్‌వేవ్ ఫుడ్స్ సంస్థను డానోన్ ఎస్ఎకు రెండేళ్ల క్రితం 10 బిలియన్ల డాలర్లకు ఆమె విక్రయించేశారు. డారిటోస్ అండ్ లేస్ చిప్ సంస్థతోపాటు స్నాక్స్ విభాగాన్ని బీవరేజెస్ డివిజన్ నుంచి విడదీయాలని ప్రతిపాదిస్తూ ఇంద్రా నూయి నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకు పెప్సికో సంస్థ విస్తరణకు మార్గం సుగమమైంది. 

ఇక పెప్సికో స్నాక్స్ అనుబంధ సంస్థ ‘క్రాఫ్ట్ హైంజ్’కు, సోడా బ్రాండ్‌ను అన్హెసెర్ - బచ్ అనే సంస్థలకు విక్రయించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పెప్సికో నుంచి వైదొలిగేందుకు ఇంద్రానూయి సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా కార్పొరేట్ రంగంలోనూ మార్పులు జరుగొచ్చు. ఈ అంశాలన్నీ ఇంద్రానూయి స్థానంలో సీఈఓగా బాద్యతలు స్వీకరించనున్న లాగుర్టాకు సమస్య కానున్నది. రామన్ లాగుర్టా కొంత కాలం నుంచి పెప్సీలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. పెప్సి సంస్థ మనుగడను కాపాడేందుకు లాగుర్టాకు జీవన్మరణ సమస్యగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ప్రకారం 2014 మార్చి నెలాఖరు నాటికి పెప్సికో రూ.280 కోట్ల ఆదాయం నష్టాన్ని చవి చూసింది. 2006 నుంచి ఇదే పెప్సికో సంస్థ అత్యధికంగా ఆదాయంలో రెండంకెల వ్రుద్ధి సాధించింది. ఫుడ్, స్నాక్స్ రంగాల్లోనూ విజయాలు సాధించింది. విషాదమేమిటంటే లాభాల బాట ఎంతో కాలం సాగలేదు. 2014 తర్వాత గతేడాది మార్చి నెలాఖరు నాటికి సంస్థ భారత్ ఆదాయం రూ.6,540 కోట్లకు తగ్గిపోయింది, 2013 మార్చితో ముగిసిన సంవత్సరంలోనే పెప్సికో ఇండియా ఆదాయం రూ.6,994.8 కోట్లుగా రికార్డయింది. 

పెప్సికో భారత వ్యాపారం సమస్యల్లో చిక్కుకుంటే.. ఇంద్రానూయి సారథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి వచ్చే ఆదాయం 80 శాతం పెరిగి 63.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. ఇంద్రా నూయి నిష్క్రమణపై పెప్సికో ఇండియా మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డీ శివకుమార్ స్పందించేందుకు నిరాకరించారు. పెప్సికో ఇండియా బాట్లింగ్ భాగస్వామి వరుణ్ బేవరేజెస్ అధినేత రవి జైపూరియా అసలు స్పందించనే లేదు.  

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఎస్ అండ్ పీ - 500 కార్పొరేట్ సంస్థల్లో కేవలం 23 మంది సీఈఓలు మాత్రమే మహిళామణులు. ఇది అంతర్జాతీయంగా ఐదు శాతానికి లోపే. ఇంద్రానూయి రాకతోనే అంతర్జాతీయ శీతల పానీయ దిగ్గజం ‘పెప్సికో’లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. కార్పొరేట్ సంస్థల్లో సీఈఓల్లో మరింత మంది మహిళలు రావడానికి ఇంద్రానూయి కీలకంగా మారారు. గతేడాది కార్పొరేట్ సంస్థల సీఈఓల్లో 27 మంది మహిళలు ఉన్నారు. 

అమెరికా కార్పొరేట్ రంగం సైతం నాయకత్వస్థానంలోకి మహిళల రాకతో నిజమైన మార్పులకు నాంది ప్రస్తావన ఏర్పడుతుందని చెబుతోంది. కానీ సుదీర్ఘ కాలం పాటు పెప్సికో సీఈఓగా బాద్యతలు నిర్వహించిన ఇంద్రా నూయి వైదొలుగడం.. ఆమె వారసుడిగా అక్టోబర్ మూడో తేదీన బాధ్యతలు స్వీకరించనున్న రామన్ లాగుర్టాకు సంస్థ నిర్వహణ పరంగా పలు సమస్యలు ఎదురు కావచ్చు. 

loader