Asianet News TeluguAsianet News Telugu

‘పేటీఎం’ నూతన ప్లాన్లు: రిటైల్ బిజినెస్‌కు పెట్టుబడుల సేకరణ

‘న్యూ రిటైల్’ రంగంలో బిజినెస్ స్రుష్టించతలపెట్టింది డిజిటల్ దిగ్గజం ‘పేటీఎం’. ఇందుకోసం 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

Paytm seeks $500 million for new business

న్యూఢిల్లీ: ‘న్యూ రిటైల్’ రంగంలో బిజినెస్ స్రుష్టించతలపెట్టింది డిజిటల్ దిగ్గజం ‘పేటీఎం’. ఇందుకోసం 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. చైనాలోని కౌబే, మిథువాన్ తరహాలో నూతన రిటైల్ బిజినెస్‌ను విస్తరించాలని ‘పేటీఎం’ భావిస్తున్నది. ‘వన్97’ కమ్యూనికేషన్స్ యాజమాన్యంలోని డిజిటల్ చెల్లింపుల సంస్థ ‘పేటీఎం’ నూతన ఇన్వెస్టర్ల నుంచి 500 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను కోరుతోందని ఆ సంస్థ సన్నిహిత వర్గాల కథనం. 

వచ్చే నెలాఖరు నాటికి పేటీఎం నూతన రిటైల్
వచ్చేనెలాఖరు నాటికి ‘నూతన రిటైల్’ ప్రారంభం కానున్నదని పేటీఎం సీఈఓ రేణు సాథి తెలిపారు. చైనాకు చెందిన కౌబే, మితువాన్ సంస్థల తరహాలో తాజా పేటీఎం విస్తరణ ఉండనున్నది. కౌబే ఆధ్వర్యంలో రెస్టారెంట్లు, ట్రావెలింగ్, కొనుగోళ్లు.. మితువాన్ సారథ్యంలో ఫుడ్ డెలివరీ స్టార్టప్‌లపై పెట్టుబడులు పెడతున్నది. స్థానిక ఉత్పత్తుల, రిటైల్ సర్వీసుల ఆధారంగా వెబ్‌సైట్‌ను కొనుగోలు చేయనున్నది.

ఆన్‌లైన్ ఆర్డర్లతో ఇన్ స్టంట్ డెలివరీ
పొరుగున ఉన్న ఫార్మసీ, నిత్యావసర వస్తువుల స్టాళ్ల నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లతో ఇన్‌స్టంట్ డెలివరీ అందజేయనున్నది. టెక్నాలజీ, లాజిస్టిక్స్, మార్కెటింగ్ సామర్థ్యంపై పట్టు కలిగి ఉన్న షాప్ కీపర్ల కోసం ‘పేటీఎం’ అన్వేషిస్తోంది. పాన్ ఇండియా వ్యాప్తంగా నెట్‌వర్క్ కలిగి ఉన్న అంతర్గతంగా సిటీ సేవలు అందుబాటులోకి తేనున్నది. 

పేటీఎం నెట్‌వర్క్ ఇలా
ఇప్పటికే స్థానిక దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలు, చిల్లర దుకాణాలతో నెట్ వర్క్ కలిగి ఉన్న పేటీఎం ఇక నుంచి నూతన రిటైల్ సర్వీసుల నుంచి చెల్లింపులు స్వీకరించనున్నది. హైపర్ లోకల్ స్పేస్, రోజువారీ అవసరాలకు మధ్య గల గ్యాప్ ను పూడ్చాల్సిన అవసరం ఉందని పేటీఎం వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. రోజువారీగా లక్షల ఆర్డర్లు పొందాలన్నదే తమ అభిమతం అని చెప్పారు. ఇందుకోసం స్థానిక రెస్టారెంట్లు, గ్రాసరీ స్టోర్లు, ఫార్మసీల నుంచి ఆర్డర్లు, డెలివరీ సేవల కోసం కలిసి పని చేస్తుందన్నారు. తాజాగా పేటీఎం ఏర్పాటు చేయనున్న ‘న్యూ రిటైల్’కు పేటీఎం సీఈఓగా రాజీనామా చేయనున్న రేణు సేథి సారథ్యం వహించనున్నారు. 2020 నాటికి ఆర్డర్లు మూడోవంతుకు చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. 

జపాన్‌ మార్కెట్లోకి పేటీఎం?
పేపే సంస్థతో కలిసి జపాన్‌లోని బార్‌కోడ్‌ ఆధారిత సేవలు అందించేందుకు పేటీఎం సిద్ధమవుతోంది. అన్నీ సజావుగా సాగితే నవంబర్‌ నుంచి పేటీఎం జపాన్‌లో కూడా సేవలు అందిస్తుంది. పేపే పేరుతోనే అక్కడ సేవలు అందించనుంది. ఇది సాఫ్ట్‌బ్యాంక్‌ చెల్లింపు వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడనున్నది.
అభివృద్ధి చెందిన దేశమైన జపాన్‌ కూడా అత్యధికంగా నగదు రూపంలోనే లావాదేవీలు జరుపుతోంది. ఇక్కడ కేవలం 20% లావాదేవీలు మాత్రమే నగదు రహితంగా జరుగుతాయి. దీంతో 2025 నాటికి నగదు లావాదేవీల శాతాన్ని40శాతానికి చేర్చాలని జపాన్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

సాఫ్ట్ బ్యాంక్, యాహూ జపాన్ ఆధ్వర్యంలో పేపే కార్న్ స్థాపన
దీంతో భవిష్యత్‌లో పెరగనున్న నగదు రహిత లావాదేవీలను అందిపుచ్చుకోవాలని సాఫ్ట్‌బ్యాంక్‌ , యాహూ జపాన్‌ కార్ప్‌లు కలిసి జూన్‌లో పేపే కార్ప్‌ను నెలకొల్పాయి. దీంతో యాహూ జపాన్‌ వాలెట్‌ కార్యకలాపాలను కూడా నిలిపివేయనుంది. కాకపోతే యాహు జపాన్‌ ఐడీ ఉన్నవారు, యాహూ వాలెట్‌ ఉన్నవారు పేపే సేవలు పొందవచ్చు.
పేపేలో వాటాదారు అయిన సాఫ్ట్‌బ్యాంక్‌ పేటీలో కూడా ప్రధాన పెట్టుబడిదారు. దీంతో జపాన్‌లో పేపేను అభివృద్ధి చేయడానికి పేటీఎం అనుభవాన్ని కూడా ఉపయోగించుకోనుంది.

మార్కెట్ కేపిటలైజేషన్‌లో ఐటీసీకి నాలుగో స్థానం
గత శుక్రవారంతో ముగిసిన స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేసన్ విలువ రూ.3,69,259.15 కోట్లకు చేరుకుని నాలుగో స్థానానికి చేరుకున్నది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న హిందూస్థాన్ యూనీ లివర్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను దాటేసింది. ఐటీసీ షేర్ 5.24 శాతం పెరిగి రూ.302.20 వద్ద స్థిరపడింది. అంతర్గత ట్రేడింగ్‌లో 6.91 శాతం రూ.307 వద్దకు చేరుకుని 52 వారాల గరిష్ఠ స్థాయి వద్ద స్థిరపడింది. గతవారంలో ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,460.27 కోట్లు పెరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios