విశాఖ పట్నంలో ముగిసిన  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో Paytm కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒఫ్పందంలో బాగంగా,ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ప్రజారోగ్యం, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో సేవలు అందించేందుకు పేటీఎం ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఏపీ ప్రభుత్వ  IT కార్యదర్శి సౌరభ్ గౌర్, Paytm వ్యవస్థాపకుడు CEO అయిన విజయ్ శేఖర్ శర్మ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

Paytm బ్రాండ్‌ను కలిగి ఉన్న One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకున్నట్లు నేడు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 సందర్భంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ప్రజారోగ్యం, సైబర్ సెక్యూరిటీ, ఆర్థిక మోసాల నివారణ రంగాలలో పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేటీఎం ఓ ప్రకటనలో తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ సౌరభ్ గౌర్, Paytm వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్, CEO అయిన విజయ్ శేఖర్ శర్మ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.

Scroll to load tweet…

ప్రధాన ఆర్థిక స్రవంతిలోకి 50 కోట్ల మంది భారతీయులను తీసుకురావాలనే లక్ష్యంతో Paytm ఆంధ్రప్రదేశ్‌తో ఈ ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటనలో వివరించారు. అంతే కాదు చిరువ్యాపారులు, వీధి విక్రేతలు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంతో పాటు, వారికి రుణాలను అందించే దిశగా పేటీఎం చర్యలు తీసుకోనుంది. Paytm తన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి eGovernment సేవలను అందించే దిశగా కోసం విస్తరించాలని ఆలోచిస్తోంది. 

పలు రకాల ప్రభుత్వ సేవల డిజిటల్ చెల్లింపులను ఆమోదించడానికి వివిధ ప్రభుత్వ విభాగాలకు ఈ ఒఫ్పందం ద్వారా అధికారం కల్పించనున్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందే వీలుంది.

ఇక పబ్లిక్ హెల్త్ విభాగంలో సైతం పేటీఎం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయనుంది. రాబోయే యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ (UHI) ప్రోగ్రామ్ కింద ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో OPD అపాయింట్‌మెంట్ బుకింగ్‌ను సులభతరం చేయడంలో Paytm స్టేట్ హెల్త్ అథారిటీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది.

అలాగే సైబర్ సెక్యూరిటీ విభాగంలో Paytm తన సేవలను ఏపీ ప్రభుత్వానికి అందించనుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి సైబర్‌ సెక్యూరిటీ శిక్షణను నిర్వహించాలని తీర్మానించుకుంది. ముఖ్యంగా పట్టణేతర ప్రాంతాల్లో నివసించే వారిలో సైబర్‌ సెక్యూరిటీ పట్ల అవగాహన పెంచడానికి ప్రచారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తోంది. 

ఈ సందర్బంగా Paytm వ్యవస్థాపకుడు CEO విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది. మా భాగస్వామ్యానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము. ఈ భాగస్వామ్యం వివిధ ఆర్థిక సేవలను లక్షలాది చిన్న వ్యాపారాలను కొనసాగించేందుకు దోహదపడుతుందని” ఆశాభావం వ్యక్తం చేశారు.