Asianet News TeluguAsianet News Telugu

భారీగా త‌గ్గిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌..?‌

అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్  ధ‌ర‌లు దిగిరావ‌డంతో  దాయాది దేశం పాకిస్తాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్తాన్‌ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అక్క‌డి దేశ మీడియా పేర్కొంది. పెట్రోల్ ధర పై లీటర్ కు రూ. 20 రూపాయలు తగ్గించాలని నిశ్చయించుకుంది. 

pakisthan decreases petrol and diesel prices
Author
Hyderabad, First Published May 1, 2020, 11:09 AM IST

ఇస్లామాబాద్:‌ వాహన వినియోగదారులకు గుడ్ న్యూస్ ఏంటంటే భారీగా  పెట్రోల్, డీజిల్ ధరలు త‌గ్గిస్తూ ప్ర‌జ‌ల‌కు పెద్ద ఊర‌ట క‌లిగించింది. అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్  ధ‌ర‌లు దిగిరావ‌డంతో  దాయాది దేశం పాకిస్తాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

పాకిస్తాన్‌ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అక్క‌డి దేశ మీడియా పేర్కొంది. పెట్రోల్ ధర పై లీటర్ కు రూ. 20 రూపాయలు తగ్గించాలని నిశ్చయించుకుంది. అలాగే అటు హై స్పీడ్ డీజిల్ ధర ఏకంగా రూ. 33.94 తగ్గించనున్నట్టు పాకిస్తాన్ ఆయిల్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ తెలిపింది.

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ తో చర్చించిన అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు సిద్ధమైందని డాన్ అనే పత్రిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. రేపటి నుంచే తగ్గిన ధరలు అమల్లోకి వస్తాయని అందులో  పేర్కొంది.

అటు కిరోసిన్ ధ‌ర‌లు కూడా భారీగా త‌గ్గుతాయ‌ని తెలిపింది. దీంతో వాహన దారులకు పెట్రోల్ మంట నుండి భారీ ఉరట లభించనుంది. ప్రపంచమంత కరోనా వైరస్ బారిన పడి ఆర్ధిక రంగాన్ని కుదేలు చేసింది.

దేశ దేశాల రాకపోకలు నిలిచిపోవడంతో దిగుమతులు, ఎగుమతులు ఆగిపోయాయి. వాణిజ్య పరంగా ప్రపంచ దేశాలు నష్టాన్ని అనుభవిస్తున్నాయి. కరోనా వైరస్ ప్రభావం క్రూడ్ ఆయిల్ పై పడటంతో ఇంధన ధరలు తగ్గడానికి ఒక కారణం.
 

Follow Us:
Download App:
  • android
  • ios