Asianet News TeluguAsianet News Telugu

రతన్ టాటాపై 3వేల కోట్ల పరువునష్టం కేసులో కీలక మలుపు...

టాటా సన్స్ గ్రూప్ సంస్థలో సైరస్ మిస్త్రీ వివాదం రతన్ టాటాను అనునిత్యం ఆందోళనకు గురి చేస్తోంది. సైరస్ మిస్త్రీని టాటా సన్స్ తొలగించి వేయడంతో రతన్ టాటాపై నుస్లి వాడియా పరువునష్టం దావా వేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సలహా మేరకు నుస్లీ వాడియా ఈ నిర్ణయం తీసుకున్నారు. నుస్లీ వాడియా పరువు తీసే యోచనే లేదని టాటా తేల్చేయడంతో వివాదం సమసిపోయింది.  
 

Nusli Wadia withdraws defamation plea against Ratan Tata
Author
Hyderabad, First Published Jan 14, 2020, 1:34 PM IST

న్యూఢిల్లీ: టాటా సన్స్ సంస్థలో మైనారిటీ వాటాదారుల హక్కులు, చైర్మన్ పదవిపై న్యాయ పోరాటానికి దిగిన సైరస్ మిస్త్రీతో తలనొప్పిని ఎదుర్కొంటున్న ఆ గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటాకు మరో రూపంలో ఊరట లభించింది. మిస్త్రీ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఈ వివాదంలో రతన్‌టాటాపై నమోదుచేసిన నేరపూరిత పరువునష్టం కేసు ఉపసంహరించుకోవాలని బాంబే  డైయింగ్‌  చైర్మన్‌ నుస్లీ వాడియా నిర్ణయించారు. రతన్‌ టాటా సహా ఇతరులపై రూ. 3000 కోట్ల విలువైన పరువు నష్టం దావాలన్నింటిని వెనక్కి తీసుకున్నారు. 

also read పండగ రోజున కాస్త చల్లబడ్డ బంగారం ధరలు...

దీంతో నుస్లీవాడియా - రతన్ టాటా మధ్య యుద్ధానికి తెరపడింది. పరిణతి చెందిన వ్యక్తులుగా ఇద్దరూ కేసులను పరిష్కరించుకోవాలని టాటా, వాడియాలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే ఇటీవల కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం.

రతన్ టాటాపై పరువు నష్టం దావాను వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఉపసంహరించుకున్నారు. వాడియాపై పరువు తీసే ఉద్దేశం లేదని టాటా సుప్రీంకోర్టుకు చెప్పడంతో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్సీ వ్యాపారవేత్త ఈ నిర్ణయం తీసుకున్నారు. టాటా సన్స్‌ నుంచి ఆయన మిత్రుడు సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన అనంతరం వాడియా ఆయనకు మద్దతుగా నిలిచారు.

Nusli Wadia withdraws defamation plea against Ratan Tata

దీంతో టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌,  టాటా కెమికల్స్‌లో అత్యంత సీనియర్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ నుస్లీ వాడియాను తొలగించేందుకు నిర్ణయించింది. దీంతో నుస్లీ వాడియా రూ .3,000 కోట్లు పరిహారం కావాలని కోరుతూ 2016 డిసెంబర్‌లో పరువునష్టం కేసు దాఖలు చేశారు.

also read ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

ఇందులో వాడియా బోర్డు సభ్యులు అజయ్ పిరమల్, రణేంద్ర సేన్, విజయ్ సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ఫ్ స్పేత్ , ఎఫ్ఎన్ సుబేదార్లతో పాటు మిస్త్రీ తరువాత వచ్చిన టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌ను కూడా చేర్చారు.2019  జూలైలో బాంబే హైకోర్టు ఈ కేసును కొట్టివేయడంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.

కాగా, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ తన తొలగింపుపై సైరస్‌ మిస్త్రీ దాఖలు చేసుకున్న కేసులో మిస్త్రీని తిరిగి నియమించాలని కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఉత్తర్వులిచ్చింది. అయితే జనవరి 10న ఈ  ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపి వేసిన సంగతి తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios