సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం రోజు బంగారం ధరలు భారీగా తగ్గు ముఖం పట్టాయి. ఇరాన్ - అమెరికా దేశాల వైరం, అమెరికా- చైనా వాణిజ్య ఒప్పొందాలు మార్కెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దీంతో నిన్నటికంటే భోగి సందర్భంగా బంగారం రేట్లు భారీగా తగ్గాయి.

హైదరాబాద్ లో 1గ్రాము బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

also read ఉల్లి ‘ఘాటు’తో కంటనీరు...ధరల ప్రభావంతో తొలిసారి....

నిన్న 1 గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ.3,821 ఉండగా ఈరోజు బంగారం ధర రూ.3801 గా ఉంది. దీంతో నిన్నటికి ఇవ్వాల్టికి బంగారం ధర వ్యత్యాసం రూ.20 ఉంది.నిన్న 1 గ్రాము 24 క్యారట్ల బంగారం ధర రూ. 4,206 ఉండగా ఈరోజు బంగారం ధర రూ. 4,146గా ఉంది. దీంతో నిన్నటికి ఇవ్వాల్టికి బంగారం ధర వ్యత్యాసం రూ.60 ఉంది.

హైదరాబాద్ లో 10గ్రాముల బంగారం ధరలు ఇలా ఉన్నాయి

నిన్న 10 గ్రాములు 22 క్యారట్ల బంగారం ధర రూ.38,210 ఉండగా ఈరోజు బంగారం ధర రూ.38,010 ఉంది. దీంతో నిన్నటికి ఇవ్వాల్టికి బంగారం ధర వ్యత్యాసం రూ.200 ఉంది. నిన్న 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 42,060 ఉండగా ఈ రోజు బంగారం ధర రూ. 41,460 ఉంది. దీంతో నిన్నటికి ఇవ్వాల్టికి బంగారం ధర వ్యత్యాసం రూ. 600 ఉంది. అయితే ఈ రేట్లు ఇలాగే కొనసాగితే బంగారం రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్ లో బంగారం రేట్లు ఇలా ఉంటే ..విజయవాడ, విశాఖ లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

విజయవాడలో 22 క్యారట్ల బంగారం ధర రూ.38,101 ఉండగా విశాఖలో 22 క్యారట్ల బంగారం ధర రూ. 38,010 గా ఉంది.విజయవాడలో 24 క్యాటర్ల బంగారం ధర రూ. 41,460 ఉండగా విశాఖలో 24 క్యారట్ల బంగారం ధర రూ. 41,460 గా ఉంది.

 ఢిల్లీ లో  బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

also read లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు... రికార్డ్ స్థాయిలో ఇన్ఫోసిస్

ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.38,800  ఉండగా  24 క్యారట్ల బంగారం ధర రూ. 40,000 ఉంది.

ఈ రోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి

1 గ్రాము వెండి ధర రూ.49
10 గ్రాముల వెండి ధర రూ. 490
100 గ్రాముల వెండి ధర రూ.4900
1000 గ్రాముల వెండి ధర రూ. 49.000 ఉంది.