Asianet News TeluguAsianet News Telugu

రాహుల్ గాంధీకి నిర్మలా సీతారామన్ కౌంటర్... ట్విట్టర్ ద్వారా ట్వీట్

ఆర్‌బిఐ ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించిన  జాబితాను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల తరువాత రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆరోపించారు.

Nirmala Sitharaman's Tweet Counter To Rahul Gandhi's in social media
Author
Hyderabad, First Published Apr 29, 2020, 5:34 PM IST

న్యూ ఢిల్లీ: మంగళవారం అర్థరాత్రి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వరుస ట్విట్లు ట్విట్టర్ లో వేడిని పుట్టించాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారులు,మొండి బాకీ రుణాలు వంటి ఆరోపణల చేసిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంటు అని ఆమె రాత్రి 11 గంటలకు 13-ట్వీట్వతో  ప్రతీకారంగా బదులు చెప్పారు.


"ఎంపి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఇద్దరు  ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 50 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బి‌ఐ) విడుదల చేసిన జాబితా తరువాత రాహుల్ గాంధీ అధికార పార్టీ బిజెపిపై మాటల దాడి చేశారు, అధికార పార్టీ యొక్క "స్నేహితులు" ఇందులో ఉన్నందున ప్రభుత్వం ఈ జాబితాను పార్లమెంటు నుండి దాచిపెట్టిందని అన్నారు.


"50 మంది అతిపెద్ద బ్యాంక్ స్కామర్ల పేర్లను చెప్పండి అని నేను పార్లమెంటులో ఒక సాధారణ ప్రశ్న అడిగాను. దానికి కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు ఆర్‌బి‌ఐ నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, ఇతర బిజెపి సన్నిహితుల పేర్లను జాబితాలో పెట్టింది. అందుకే వారు పార్లమెంటు నుండి నిజం దాచారు అంటు కాంగ్రెస్ ఎంపీ ఒక వీడియోతో పాటు హిందీలో ట్వీట్ చేశారు.

2009-10, అలాగే  2013-14 మధ్య కాలంలో, షెడ్యూల్ చేసిన వాణిజ్య బ్యాంకులు 1,45,226 కోట్ల రూపాయలను వదులుకున్నాయని నిర్మలా సీతారామన్ వాదించారు.
    
ఆర్‌బిఐ నిర్దేశించిన నాలుగేళ్ల ప్రొవిజనింగ్ సైకిల్ ప్రకారం నాన్-పెర్ఫార్మింగ్ ఆస్తులకు కేటాయింపులు చేసినట్లు ఆమె తెలిపారు. "పూర్తి కేటాయింపు పూర్తయిన తరువాత, బ్యాంకులు పూర్తిగా అందించిన ఎన్‌పిఎను ఉంటుంది, కాని రుణగ్రహీతకు వ్యతిరేకంగా రికవరీని కొనసాగిస్తాయి. రుణం మాత్రం మాఫీ చేయదు" అని ట్విట్టర్ లో  కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్న రఘురామ్ రాజన్‌ను ఆమె ఉటంకించారు "2006-2008 మధ్య కాలంలో పెద్ద సంఖ్యలో  మొండి బాకీ రుణాలు పుట్టుకొచ్చాయి, బాగా తెలిసిన ప్రమోటర్లకు చాలా రుణాలు ఇవ్వటం జరిగింది, వారికి రుణాలను ఎగవేసిన చరిత్ర కూడా ఉంది.


ఇదిలావుంటే రద్దయిన బాకీలకు సంబంధించిన సంస్థలు, వాటి యజమానులపై సీబీఐ, ఈడీల దర్యాప్తులు జరుగుతున్నాయి. ఇక కార్పొరేట్ల రుణాలు, ఎగవేతలు, రద్దులపై పార్లమెంట్‌ చివరి సమావేశాల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లోక్‌సభలో గొంతెత్తిన సంగతి తెలిసిందే. 2014 నుంచి నిరుడు సెప్టెంబర్‌ వరకు రూ.6.66 లక్షల కోట్ల రుణాలను ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. 


"9,967 రికవరీ సూట్లు, 3,515 ఎఫ్ఐఆర్ లు, కేసులలో ఫ్యుజిటివ్ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నాయి. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా కేసులలో అటాచ్మెంట్, సీజ్ చేసిన మొత్తం విలువ: రూ .18,332.7 కోట్లు" అని ఆమె చెప్పారు.


"మొత్తం యాభై మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించిన మొత్తం నిధుల విలువ, మొత్తం బ్యాంక్ వారీగా వివరాలను 16.3.2020 న రాహుల్ గాంధీ లోక్ సభలో అడిగిన ప్రశ్న * 305 కు సమాధానంగా అందించబడింది," అని  ఆర్ధిక మంత్రి ట్విట్టర్  పోస్ట్ చేశారు.


గత ఏడాది నవంబర్ 18న పార్లమెంటులో ప్రభుత్వ రంగ బ్యాంకులలో (రూ. 5 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ) ఉద్దేశపూర్వకంగా ఎగవేతగా తీసుకున్నవారి జాబితాను అందించినట్లు ఆమె తెలిపారు.వ్యవస్థను చక్కబెట్టడంలో  నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో ఎందుకు విఫలమవుతున్నారో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

Follow Us:
Download App:
  • android
  • ios