న్యూ ఢిల్లీ:  పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి)లో 13,500 కోట్ల రూపాయల కుంభకోణం కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) శనివారం ప్రధాన నిందితుడైన్ నీరవ్ మోడీపై  బెదిరింపు ఆరోపణలు చేసింది. దీనిపై సి‌బి‌ఐ ఒక క్రిమినల్ చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అరెస్టుల నుండి తప్పించుకోవడానికి ఆశిష్ మోహన్‌భాయ్ లాడ్‌ దుబాయ్ నుండి కైరోకు పారిపోయాడని సిబిఐ తెలిపింది. 

also read కార్పొరేట్లకు తక్కువ వడ్డీ రుణాలతో రిస్క్‌... ఎస్బీఐ చైర్మన్

"ఆశిష్ మోహన్‌భాయ్ లాడ్‌ను నీరవ్ మోడీ బెదిరించిన తరువాత న్యాయవాది, యూరోపియన్ కోర్టు జడ్జ్ ముందు నిరోవ్ మోడీకి అనుకూలంగా స్టేట్ మెంట్ ఇవ్వాలని అందుకు నిందితుడు నేహాల్ మోడీ  ఆశిష్ మోహన్‌భాయ్ లాడ్‌కు రూ .20 లక్షలు కూడా ఇచ్చారని దర్యాప్తులో తేలింది. అయితే దీనిని లాడ్ తిరస్కరించాడు "అని సిబిఐ చార్జిషీట్లో తెలిపింది.

ఈ కుంభకోణంలో ప్రాసిక్యూషన్ నుండి తప్పించుకు తిరుగుతున్న నీరవ్ మోడీని ఈ నెల ప్రారంభంలో కోర్ట్ అతనిని ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది.నీరవ్ మోడీ ప్రస్తుతం నైరుతి లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నాడు. అతని సమీప బంధువు మెహుల్ చోక్సీతో పాటు బ్యాంకుకు రూ .13,570 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

also read ముకేశ్ అంబానీకి గట్టి షాక్ ఇచ్చిన కేంద్రం...

ఈ కేసుకు సంబంధించి నీరవ్ మోడీ (48) ను ఈ ఏడాది మార్చిలో స్కాట్లాండ్ యార్డ్ లో పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుల నుండి పలుసార్లు సమన్లు ​​ఇచ్చినప్పటికీ అతను భారతదేశానికి తిరిగి రాలేదు. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని భారత్ కు అప్పగించాలని కోరుతోంది.