ఐటీ శ్లాబ్‌లపై కనిపించని క్లారిటీ...13 లక్షలు దాటితే...

ఐటీ శ్లాబ్‌లపై నెలకొన్న సందిగ్ధం తొలగనే లేదు. అయితే రూ.13 లక్షలు దాటితే కొత్త విధానమే మేలు అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కొందరికైతే ఈ నూతన శ్లాబ్ పాలసీ మేలు చేస్తుందన్నారు. పన్ను చెల్లింపుదారులంతా అధిక పన్ను చెల్లించాల్సి వస్తే కొత్త శ్లాబ్ లతో కూడిన విధానం ఎందుకు తీసుకొస్తామని ప్రశ్నించారు. దీనిపై మరింత స్పష్టతనిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
 

New tax regime to definitely benefit taxpayers in some brackets: Nirmala Sitharaman

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయ పన్ను (ఐటీ) శ్లాబులు ఎవరికి మేలు చేకూరుస్తాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వార్షిక ఆదాయం రూ.13 లక్షల కంటే ఎక్కువ ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు తగ్గింపు క్లెయిమ్‌ చేసే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కొత్త విధానమే మేలని అధికార వర్గాలు అంటున్నాయి.

అయితే వార్షిక ఆదాయం రూ.12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉండి, ఏటా రూ.2 లక్షల వరకు పెట్టుబడుల తగ్గింపులు క్లెయిమ్‌ చేసే వారికి మాత్రం పాత విధానమే మేలని పేర్కొన్నాయి.అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 5.78 కోట్ల మంది ఐటీ చెల్లింపుదారులు ఉన్నారు. వీరిలో 5.3 కోట్ల మంది (90 శాతం) రూ.2 లక్షల కంటే తక్కువ మొత్తాన్ని డిడక్షన్ కోసం క్లెయిమ్‌ చేస్తున్నారు.

also read బడ్జెట్ పుణ్యమా అని...రిలయన్స్ సహా బ్లూచిప్‌లకు లక్షల కోట్ల నష్టం..

ప్రామాణిక తగ్గింపు, పీఎఫ్‌, గృహ రుణాలపై చెల్లించే వడ్డీ, ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌, జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపు వంటి వాటిని డిడక్షన్ క్లయిమ్‌గా చూపుతున్నారు. ఆదాయం పన్ను చెల్లింపులకు ఇప్పటికే 10, 20, 30 శాతం శ్లాబులు అమల్లో ఉన్నాయి. వీటికి తోడు ఆర్థిక మంత్రి సీతారామన్‌ కొత్తగా రూ.7.5-10 లక్షల వార్షిక ఆదాయ వర్గాల కోసం 15 శాతం శ్లాబ్, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారి కోసం 25 శాతం శ్లాబ్ ప్రవేశపెట్టారు. 

వార్షిక ఆదాయం రూ.15 లక్షలు మించితే వారు 30 శాతం శ్లాబు పరిధిలోకి వస్తారు. ఎలాంటి మినహాయింపులు, తగ్గింపులు క్లెయిమ్‌ చేయని ఐటీ చెల్లింపుదారుల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ కొత్త శ్లాబులు ప్రకటించారు.వార్షిక ఆదాయం రూ.13 లక్షలపైన ఉండి రూ.2 లక్షల వరకు తగ్గింపులు క్లెయిమ్‌ చేస్తే పాత శ్లాబుల ప్రకారం రూ.1.48 లక్షలు పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.

New tax regime to definitely benefit taxpayers in some brackets: Nirmala Sitharaman

మినహాయింపులు, తగ్గింపులు లేని కొత్త విధానం ఎంచుకుంటే వీరు రూ.1.43 లక్షలు ఐటీగా చెల్లిస్తే సరిపోతుంది. అంటే పన్ను పోటు రూ.5,200 తగ్గుతుందిఅదే రూ.2 లక్షల తగ్గింపు క్లెయిమ్‌తో వార్షిక ఆదాయం రూ.14 లక్షలు మించితే రూ.10,400, రూ.15 లక్షలు మించితే రూ.15,600 ఆదా అవుతాయి.

రూ.50వేల ప్రామాణిక తగ్గింపు లేని వేతనయేతర వ్యక్తుల వార్షిక ఆదాయం రూ.9.5 లక్షలు ఉండి రూ.1.5 లక్షల పెట్టుబడుల తగ్గింపు ఎంచుకుంటే వార్షిక పన్ను చెల్లింపు భారం రూ.5,200 తగ్గుతుంది.కొత్త ఆదాయం పన్ను (ఐటీ) విధానాన్ని నిపుణులు సంక్లిష్టంగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు నూతన పద్ధతి తప్పక లాభదాయకమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

also read ఫోటోలు లీక్:అమెజాన్ సి‌ఈ‌ఓ పై అతని గర్ల్ ఫ్రెండ్ సోదరుడి దావా...

ఆమె కొత్తగా ప్రవేశపెట్టిన శ్లాబ్‌లపై ఐటీ, ఆర్థిక నిపుణుల నుంచి పెదవి విరుపులు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం తమ బడ్జెట్ ప్రతిపాదనపై మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అవసరమైతే కొత్త ఐటీ విధానంపై ప్రభుత్వమే మరింత స్పష్టత ఇస్తుందన్నారు. 

‘శనివారమే ఈ అంశంపై కొన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చాం. ఈరోజు మరిన్ని అనుమానాలను నివృత్తి చేస్తున్నాం. పాత విధానం కంటే కొత్త విధానంలో పన్ను చెల్లింపుదారులు ఎక్కువగా కట్టాల్సి వస్తే.. అసలు ఎందుకీ విధానాన్ని పరిచయం చేస్తాం’ అని ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. 

ఈ క్రమంలోనే అందరికీ కాకపోయినా కొందరికైతే కొత్త పథకం లాభమేనన్నారు. నూతన విధానంలో ఎలాంటి మినహాయింపులుండవని పునరుద్ఘాటించిన మంత్రి నిర్మలా సీతారామన్ కొన్ని మినహాయింపులను కలగలిపే కొత్త పథకాన్ని తెచ్చామన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios