రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డు నిబంధనలలో మార్పులు చేసింది. కొత్తగా చేసిన మార్పులు 30 సెప్టెంబర్ 2020 నుండి అమల్లోకి వస్తాయని తీలిపింది.  

 సెప్టెంబర్ 30 నుంచి ఆర్‌బి‌ఐ డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన అనేక నియమాలు మారనున్నాయి. మీరు డెబిట్, క్రెడిట్ కార్డును ఉపయోగించేవారు అయితే మీరు ఇబ్బంది పడకుండా ఉండటానికి  వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఆర్‌బి‌ఐ డెబిట్, క్రెడిట్ కార్డులను వాడే వారికి సెప్టెంబర్ 30 నుంచి కొత్త నిబంధనలను తీసుకొస్తుంది. అయితే ఈ కొత్త నిబంధనలు ఇంతకుముందు జనవరిలోనే అమలు చేయాల్సి ఉంది.  

అంతర్జాతీయ లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను నిలిపివేస్తారు. వినియోగదారులు కోరుకున్న పక్షంలో వారి ప్రాధాన్యతను విడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుది. కస్టమర్   ఏ సేవ అవసరమైతే దానికి మాత్రమే సేవను పొందుతాడు, ఇందుకు అతను ఆ సేవ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సేవ కోసం దరఖాస్తు చేసిన తర్వాతే అంతర్జాతీయ, ఆన్ లైన్, కాంటాక్ట్ లెస్ లావాదేవీల సౌకర్యం వినియోగదారులకు లభిస్తుంది.

also read దేశ ఆర్థికవ్యవస్థ ఇంకా కుదురుకోలేదు : ఆర్‌బి‌ఐ గవర్నర్‌ ...

డెబిట్, క్రెడిట్ కార్డులను జారీ చేసేటప్పుడు వినియోగదారులకు దేశీయ లావాదేవీలను అనుమతించాలని ఆర్‌బి‌ఐ బ్యాంకులకు తెలిపింది. లావాదేవీలు అవసరం లేకపోతే ఎటిఎం మెషిన్ నుండి డబ్బును ఉపసంహరించుకోండి. పిఒఎస్ టెర్మినల్ వద్ద షాపింగ్ చేయడానికి విదేశీ లావాదేవీలను అనుమతించవద్దు అని ఆర్‌బి‌ఐ సూచించింది.

 మీ కార్డుతో దేశీయ లావాదేవీలు లేదా అంతర్జాతీయ లావాదేవీలను పొందేందుకు కస్టమర్ ఎప్పుడైనా నిర్ణయించుకోవచ్చు. కస్టమర్ తన కార్డులోని ఏదైనా సేవను సక్రియం చేయడానికి లేదా తొలగించడానికి అధికారం కలిగి ఉంటారు.

కస్టమర్ తన లావాదేవీల పరిమితిని రోజుకు 24 గంటలలో ఎప్పుడైనా మార్చవచ్చు. ఇప్పుడు మీరు మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎటిఎం మెషీన్, ఐవిఆర్ ద్వారా ఎప్పుడైనా లావాదేవీల పరిమితిని ఎటిఎం వెళ్లి మీ కార్డు ద్వారా కూడా సెట్ చేయవచ్చు. ఆర్‌బిఐ జారీ చేసిన ఎటిఎం కార్డులు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 30 నుండి వర్తిస్తాయి.