న్యూ ఢీల్లీ: ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్ సంస్థ ఉద్యోగులలో దాదాపు 80 శాతం మందికి డిసెంబర్ 1 నుంచి వేతనాలను పెంచుతున్నట్లు తెలిపింది, ఇది కరోనా వైరస్‌ నేపథ్యంలో నెలకొన్న అనిశ్చిత పరిస్ధితుల్లోనూ వ్యాపార కార్యకలాపాలను యథావిథిగా కొనసాగించిన ఉద్యోగులకు వేతన పెంపును ప్రకటించింది.

బెంగళూరు ప్రధాన కార్యాలయ సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతిదారి బి3, అంతకంటే తక్కువ స్థాయిలలోని ఉద్యోగుల కోసం సింగిల్ డిజిట్ వేతన పెంపును పరిశీలిస్తున్నట్లు తెలిపింది, అయితే సీనియర్ సిబ్బంది వేతన పెంపుపై నిర్ణయం ఇంకా ఖరారు కాలేదు.

ప్రస్తుతం, విప్రో భారతదేశ నాల్గవ అతిపెద్ద ఐటి సేవల ఎగుమతిదారి, ఇందులో సుమారు 1.85 లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. వారిలో 80 శాతం మంది అంటే 1.5 లక్షల మంది సిబ్బంది  వేతన పెంపు లబ్ధి పొందనున్నారు.  "ఇంక్రిమెంట్లు కూడా గత సంవత్సరం లాగానే అనుగుణంగా ఉంటాయి" అని కంపెనీ ధృవీకరించింది.

also read ఐఫోన్12 కంటే తక్కువ ధరకే ఐఫోన్‌13.. ఇంటర్నెట్ లో ఫీచర్లు హల్‌చల్‌.. ...

కోవిడ్ -19 సంక్షోభం కారణంగా విప్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్ ఈ సంవత్సరం ప్రారంభంలో జీతాల పెంపును వాయిదా వేసింది. డిసెంబర్ 1 నుండి బి3 వరకు బ్యాండ్లలో అత్యధిక సామర్థ్యం కనబరిచినవారికి ప్రమోషన్లను ప్రకటించింది.

2020 సెప్టెంబర్ 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో విప్రో నికర లాభం రూ.2,465.70 కోట్లకు అంటే 3.40 శాతం క్షీణించింది. గత సంవత్సరం త్రైమాసికంలో నికర లాభం 2,552.70 కోట్ల రూపాయలు. .

టిసిఎస్ కూడా సిబ్బందికి అక్టోబర్ 1 నుంచి జీతం పెంపును ప్రకటించింది. ఇన్ఫోసిస్ వచ్చే ఏడాది జనవరి నుంచి ఉద్యోగులందరికీ వేతనాల పెంపును, మెరుగైన పనితీరు కనబరిచిన వారి కోసం డిసెంబర్‌లో ప్రత్యేక ప్రోత్సాహాన్ని ప్రకటించింది.

ఐటి సేవలకు, ముఖ్యంగా 4-10 సంవత్సరాల అనుభవ విభాగంలో ప్రీ-కరోనా వైరస్ స్థాయి డిమాండ్ తిరిగి రావడానికి కంపెనీలు చూస్తున్నాయని చాలా మంది నిపుణుల అభిప్రాయం.