ఐఫోన్12 కంటే తక్కువ ధరకే ఐఫోన్‌13.. ఇంటర్నెట్ లో ఫీచర్లు హల్‌చల్‌..

అయితే సమాచారం ప్రకారం, నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్ మోడల్స్ 5.4-అంగుళాలు, 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల సైజులో వస్తున్నట్లు, ఈ ఐఫోన్లలో రెండు "ప్రో" మోడల్స్, మిగతా రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అవుతాయని అంచనా. 5.4-అంగుళాల ఐఫోన్ మినీ, 6.1-అంగుళాల బడ్జెట్ ఐఫోన్, 6.1-అంగుళాల ప్రో మోడల్, 6.7-అంగుళాల ప్రో మాక్స్ మోడల్‌ను ఆశించవచ్చు.
 
 

Apple iPhone 13 in four variations, major camera upgrades leaked expected all you need to know

ఆపిల్ ఐఫోన్ 12 లాంచ్ చేసి ఒక నెలరోజుల తరువాత ఇప్పుడు ఐఫోన్ 13 గురించి పుకార్లు వినిపిస్తున్నాయి. ఆపిల్ అనలిస్ట్ మింగ్-చి కుయో ప్రకారం కుపెర్టినో చెందిన ఐఫోన్ తయారీ సంస్థ 2021లో ఐఫోన్ 12 లైనప్ లో నాలుగు కొత్త ఐఫోన్‌లను ఇండియన్ మార్కెట్ లోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

అయితే సమాచారం ప్రకారం, నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్ మోడల్స్ 5.4-అంగుళాలు, 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల సైజులో వస్తున్నట్లు, ఈ ఐఫోన్లలో రెండు "ప్రో" మోడల్స్, మిగతా రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అవుతాయని అంచనా.

5.4-అంగుళాల ఐఫోన్ మినీ, 6.1-అంగుళాల బడ్జెట్ ఐఫోన్, 6.1-అంగుళాల ప్రో మోడల్, 6.7-అంగుళాల ప్రో మాక్స్ మోడల్‌ను ఆశించవచ్చు.

also read దీపావళి ఫెస్టివల్ ఆఫర్: 10వేల లోపు లభించే బెస్ట్ ఎల్‌ఈ‌డి టి‌విలు ఇవే.. ...

 ఐఫోన్ 13 కెమెరాలో కొన్ని మెరుగుదలలు, వేగవంతమైన ఏ- సిరీస్ ప్రాసెసర్, క్వాల్కమ్ కొత్త చిప్ ఉండోచ్చు. కెమెరా టెక్నాలజీ పరంగా ఆపిల్ వినియోగదారులు మెరుగైన హై-ఎండ్ 40 నుండి 64 మెగాపిక్సెల్ కెమెరా లెన్స్‌లతో పాటు నాలుగు కెమెరా సెటప్‌లతో రవొచ్చు.

ఈ మోడల్స్ లో ఒక్క ఐఫోన్ అయినా పోర్టింగ్ లెస్ డిజైన్‌ ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి, ఇది లైటింగ్ పోర్ట్ కంటే వైర్‌లెస్ ఛార్జింగ్ మీద పూర్తిగా ఆధారపడుతుంది. ఆపిల్ ఐఫోన్ లో 120Hz ప్రోమోషన్ డిస్ ప్లే కూడా ఉండొచ్చు.

అంతేకాకుండా వచ్చే ఏడాది ఆపిల్ ఫేస్ఐడి, ఆన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ రెండింటినీ తీసుకువస్తుందని అంచనా. పూర్తిగా వైర్‌లెస్ అనుభవాన్ని అందించడానికి ఐఫోన్ తయారీదారు అన్ని ఔటర్ పోర్ట్‌లను కూడా తొలగించవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios