ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త.. కనీస వేతనం రూ. 30 వేలు?

నరేంద్ర మోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఉద్యోగులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. నెలవారీ జీతాల పరిమితిని ఏకంగా రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలో ఉన్న ఉద్యోగుల జీవితాలు భారీ మొత్తంలో పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narendra modi govt planning to double the salary limit latest reports say VNR

దేశంలో కార్మికుల సామాజిక భద్రతను పెంచేందుకు మోదీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలవారీ జీతాల పరిమితిమిని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రావిడెంట్‌ ఫండ్ పథకంలో చేరడానికి కనీస వేతన పరిమితి రూ. 15,000గా ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని రూ. 30 వేలకు పెంచాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీత పరిమితిని ఈపీఎఫ్‌తో సమానంగా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం. 

ఇందులో భాగంగానే సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్‌ ట్రస్టీస్‌ ఇటీవల సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. జీత పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐసీ రెండూ ఫండ్ చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల జీతంలో కొంత భాగంతో పాటు, యజమానుల కూడా కొంతమేర ఫండ్‌ను చెల్లించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈపీఎఫ్‌లో ఉద్యోగులు, యజమానులు 12 శాతం చొప్పున ఫండ్‌ చెల్లిస్తున్నారు. ఒకవేళ నెలవారీ జీతం పరిమితిని రూ. 30,000 పెంచితే.. ఎంప్లాయి షేర్‌ రూ. 3600కి పెరుగుతుంది. దీంతో ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పుడు మెరుగైన పెన్షన్‌ పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీంతో దేశంలో కోట్లాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు.

గతంలో.. 

ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ లిమిట్‌ను కేంద్ర ప్రభుత్వం 2014లో మార్చిన విషయం తెలిసిందే. ఆ సమయానికి రూ. 6500గా ఈపీఎఫ్‌ లిమిట్‌ను రూ. 15,000కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రూ. 15 వేల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు కచ్చితంగా ఈపీఎఫ్‌ను ఎంచుకోవాల్సిందే. అయితే ఇప్పుడు పరిమితిని పెంచితే ఎక్కువం మంది సభ్యులుగా చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్నది అమల్లోకి వస్తే ఈపీఎఫ్‌ స్కీమ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన నిర్మాణంలో కూడా మార్పులు ఉంటాయి.

వేతన పరిమితి పెరిగే ఏమవుతుంది? 

ఒకవేళ వేతన పరిమితిని పెంచితే. ఈపీఎఫ్ ఖాతా, ఉద్యోగుల పెన్షన్ ఖాతాలోకి ఎక్కువ మొత్తంలో డబ్బు జమ అవుతుంది. ఉద్యోగి వాటాతోపాటు యజమాని సహకారం కూడా పెరుగుతుంది. దీంతో దేశంలో లక్షలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్‌ రంగంపై ఆర్థికభౄరం పడుతుంది. కంపెనీలు కనీస వేతనాన్ని పెంచాలి ఉంటుంది. ఇదిలా ఉంటే ఏదైనా ఒక కంపెనీలో 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే ఆ కంపెనీ కచ్చితంగా ఈపీఎఫ్‌లో నమోదు చేసుకోవాలనే విషయం తెలిసిందే. జీతం తీసుకునే ఉద్యోగి, యాజమాన్యం ఈపీఎఫ్‌కు 12 శాతం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. 

ఈపీఎఫ్‌ఓలోకి కొత్తగా.. 

ఇదిలా ఉంటే ఈపీఎఫ్‌ఓలో చేరుతోన్న కొత్త చందాదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అక్టోబర్‌ నెలలో సరాసరి 13.41 లక్షల మంది కొత్త చందాదారులు చేరినట్లు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 7.50 లక్షల మంది తొలిసారి ఉద్యోగంలో చేరిన వారే కావడం విశేషం. ఇక ఈపీఎఫ్‌లో కొత్తగా చేరిన వారిలో 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారు 5.43 లక్షల మంది ఉన్నారు. వీరి సంఖ్య 58.49 శాతంగా ఉంది. సంఘటిత రంగంలో ఉద్యోగంలో చేరుతున్న వారిలో యువతే ఎక్కువ ఉంది. ఇక అక్టోబర్‌ నెలలో ఈపీఎఫ్‌ఓను వీడి మళ్లీ చేరిన వారి సంఖ్య 12.90 లక్షలుగా ఉందని కార్మిక శాఖ గణంకాలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగంలోకి కొత్తగా చేరిన వారిలో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios