ట్విట్టర్‌లో నుంచి తొలగించిన ఓ ఉద్యోగికి ఎలాన్ మస్క్ క్షమాపణ చెప్పాడు. ఎవరికీ తలవంచకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడే ఎలాన్ మస్క్ ఇలా ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చిందో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ కంపెనీ నుండి ఇటీవల తొలగించిన ఒక ఉద్యోగికి క్షమాపణలు చెప్పాడు. ఎలాన్ ఇలా ఒక ఉద్యోగికి క్షమాపణ చెప్పడం చాలా అరుదైన ఘటన అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల ఎలాన్ మస్క్ ట్విటర్ లో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని ఎగతాళి చేసాడు. అయితే ఆ మాజీ ఉద్యోగిని దివ్యాంగుడు అంటూ వెక్కించాడు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని మస్క్ తరువాత తన తప్పును గ్రహించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లినప్పటి నుంచి అనేక వేల మందిని ట్విట్టర్ నుండి తొలగించారు. కొద్ది రోజుల క్రితం, ట్విట్టర్ నుంచి సుమారు 200 మందిని వారికి తెలియజేయకుండా తొలగించారు. అలాంటి బాధితుల్లో హరాల్దుర్ థోర్లీఫ్సన్ అనే ఉద్యోగి సైతం ఉన్నారు. అతడిని అంతా హల్లి అని ముద్దుగా పిలుస్తారు. తన ఉద్యోగం తొలగింపుపై ట్విట్టర్ వేదికగా హరాల్‌దుర్ నేరుగా ఎలాన్ మస్క్ ను ప్రశ్నించగా, అందుకు ఎలాన్ చాలా మొరటుగా సమాధానం చెప్పాడు. హరాల్దూర్‌కు వైకల్యం ఉందని చెప్పి మరీ వెక్కిరించాడు.
అయితే మస్క్ తలబిరుసుకు హరల్దూర్ కూడా గట్టిగానే సమాధానం చెప్పాడు. తనకు శారీరక లోపం వల్ల కదలలేకపోతున్నానను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇటీవల ఎలాన్ మస్క్ బాత్రూం కు సైతం ఇద్దరు సెక్యూరిటీ గార్డులను వెంట బెట్టుకొని పోతున్నారు అనే వార్తలు సైతం జోడించి మస్క్ కు కాస్త గట్టిగానే చురకలు తగిలించారు. మస్క్ ధృఢంగానే ఉన్నా ఎలా ఇద్దరు వ్యక్తుల సహాయం తీసుకుంటున్నారని గుర్తు చేశారు. దీంతో దెబ్బకు మస్క్ దిగొచ్చాడు. అంతేకాదు హరల్దూర్ పరిస్థితి ఏంటో తనకు తెలియదని ఆయనకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు తెలపారు. ఎలాన్ మస్క్ చివరకు తన తప్పు తెలుసుకొని ఉద్యోగికి వీడియో కాల్ చేసి, ఆపై ట్విట్టర్‌లో బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అదే సమయంలో మళ్లీ హరల్‌దూర్‌ను నియమించాలని కూడా ఆదేశించాడు.
ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ ట్విటర్ ప్లాట్‌ఫారమ్‌ను గత ఏడాది అక్టోబర్ 27న 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. ట్విట్టర్‌ని కొనుగోలు చేసినప్పటి నుండి, కంపెనీలో పనిచేస్తున్న చాలా మందిని తొలగించడం ఈ పెద్ద నిర్ణయాలలో ఒకటి. ఇప్పటి వరకు వేలది మందిని ట్విట్టర్ నుంచి తొలగించారు.
