GRM Overseas ఈ స్టాక్ ఆరేళ్ల క్రితం కేవలం 3 రూపాయలు పలికింది. కానీ జనవరి 2022లో ఏకంగా 900 రూపాయలు దాటి మల్టీ బ్యాగర్ గా నిలిచింది. ఒక వేళ మీరు సరిగ్గా ఆరేళ్ల క్రితం ఈ స్టాక్ లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ రోజు అవి అక్షరాల రూ.2 కోట్లు అయి ఉండేవి. 

స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ల కోసం ఇన్వెస్టర్లు ఎప్పుడు వెతుకుతుంటారు. ఒక్క స్టాక్ మల్టీబ్యాగర్ అయినా మీ పోర్టు ఫోలియో ఉంటే చాలు కోటీశ్వరులు అయిపోవడం ఖాయం. కానీ అలాంటి స్టాక్స్ ను గుర్తించాలంటే మాత్రం మామూలు విషయం కాదు. చాలా హోం వర్క్ చేయాలి. అయితే తాజాగా స్టాక్ మార్కెట్‌లో అస్థిరత ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించిన కొన్ని స్టాక్‌లు ఉన్నాయి.

ముఖ్యంగా కొన్ని కంపెనీల వ్యాపారం అద్భుతంగానూ, వాటి బ్యాలెన్స్ షీట్ బలంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ముందు అటువంటి బలమైన ఫండమెంటల్స్ ఉన్న సంస్థలను మాత్రమే ఎంచుకోవాలి. అలాంటి స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా రాణించే అవకాశం ఉంది. 

ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు. మార్కెట్ ఒత్తిడి సమయంలోనూ కాస్త కరెక్ట్ అయినప్పటికీ. అలాంటి కంపెనీల్లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తాయి. అటువంటి GRM ఒకటి ఓవర్సీస్ కంపెనీ స్టాక్ (GRM Overseas Ltd.)

GRM ఓవర్సీస్ యొక్క బలమైన వ్యాపారం
గత కొన్ని సంవత్సరాలుగా GRM Overseas Ltd మల్టీబ్యాగర్ స్టాక్ గా బలంగా ముందుకు వచ్చింది. ఈ సంస్థ వ్యాపారం గురించి మాట్లాడినట్లయితే, GRM ఓవర్సీస్ కంపెనీ ఆగ్రో ప్రాసెసింగ్ సెక్టార్‌లో చురుకుగా ఉంది. GRM Overseas Ltd. రైస్ మిల్లింగ్ వ్యాపారానికి సంబంధించినది.

GRM ఓవర్సీస్ షేర్ 6 సంవత్సరాల క్రితం కేవలం 3 రూపాయలు మాత్రమే, అది ఇప్పుడు 593 రూపాయలకు పెరిగింది. ఈ సమయంలో, స్టాక్ సుమారు 200 రెట్లు పెరిగింది. అయితే గత నెల రోజులుగా మార్కెట్‌లో నెలకొన్న ఒత్తిడి కారణంగా ఈ షేరు దాదాపు 17 శాతం మేర పతనమైంది. కానీ గత సంవత్సరంలో, ఈ స్టాక్ దాదాపు 770 శాతం పరుగులు చేసింది.

1 లక్ష పెట్టుబడి రూ. 2 కోట్లు అయ్యింది. 
డేటా ప్రకారం, ఎవరైనా ఒక ఇన్వెస్టర్ 6 సంవత్సరాల క్రితం GRM Overseas స్టాక్‌లో కేవలం రూ. 1 లక్ష మాత్రమే పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ రోజు ఆ మొత్తం రూ. 2 కోట్లకు పెరిగింది. ఎందుకంటే గత 6 సంవత్సరాలలో, GRM ఓవర్సీస్ స్టాక్ దాదాపు 19,900 శాతం పెరిగింది.

కేవలం 1 సంవత్సరం క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ పెట్టుబడి నేడు రూ. 8.70 లక్షలకు పెరిగి ఉండేది. 6 నెలల క్రితమే రూ.లక్ష వేస్తే ఇప్పుడు రూ.3 లక్షలు వచ్చేది. ఇది మాత్రమే కాదు, GRM ఓవర్సీస్ స్టాక్ 52 వారాల గరిష్టం రూ. 935.40, ఇది జనవరి-2022లో నమోదు చేసింది.