ఆసియాలో అత్యంత ధనవంతుడైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ, తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ 2019 మార్చి ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు రిలయన్స్ బిజినెస్ లో ఎటువంటి అధికారిక పదవిని చేపట్టలేదు.

కానీ అనంత్ అంబానీ రిలయన్స్ వ్యాపార నిర్వహణ బృందంలో భాగంగా ఉన్నాడు. అనంత్ అంబానీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యను అభ్యసించాడు. తరువాత ఐస్లాండ్ లోని బ్రౌన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

అయితే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ అంబానీ కుటుంబానికి ఎంతో ముడిపడి ఉంది. దేశంలోని అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ తన తండ్రి జ్ఞాపకార్థంగా ముంబైలో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించారు.

2003 సంవత్సరంలో ప్రారంభమైన ఈ స్కూల్ నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్ బిరుదును కూడా పొందింది. ఈ స్కూల్ లో చాలా మంది ప్రముఖుల పిల్లలు మాత్రమే చదువుకోవడానికి వస్తారు. సచిన్ టెండూల్కర్, షారుఖ్ ఖాన్ నుండి శ్రీదేవి పిల్లలు వరకు ఈ స్కూల్ లోనే చదువుకున్నారు.

also read త్వరలో బంగారం, ఆభరణలపై గోల్డ్ హాల్‌మార్కింగ్ చట్టం: దీని వల్ల ప్రయోజనాలు ఏమిటో తెలుసుకోండి..

ఈ స్కూల్ చైర్‌పర్సన్ ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీ. నీతా అంబానీ సోదరి మమతా కూడా ఈ స్కూల్ లో ఉపాధ్యాయురాలు.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ఐ‌ఎల్ వార్షిక నివేదిక ప్రకారం 25 ఏళ్ల తరువాత అనంత్ అబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులో భాగం అయ్యారు, అనంత్ అంబానీ డిజిటల్ సర్వీసెస్ బోర్డులో కూడా ఉన్నారు, ఇందులో గ్రూప్ ఆల్-డిజిటల్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, ఆన్‌లైన్-టు-ఆఫ్‌లైన్ (O2O) కామర్స్ ప్లాట్‌ఫాం, జియోమార్ట్ ఉన్నాయి.

    ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ 2014లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ బోర్డులలో చేరారు. అనంత్ అంబానీ తండ్రి ముకేష్ అంబానీ ఆర్‌ఐ‌ఎల్ లో చేరిన అదే వయస్సులో అనంత్ అంబానీ ఆర్‌ఐ‌ఎల్ బృందంలో చేరాడు.

ముకేష్ అంబానీ 1981లో ఆర్‌ఐఎల్‌లో చేరినప్పుడు  అతని వయస్సు 24 సంవత్సరాలు. కొన్ని నివేదికల ప్రకారం 16 మార్చి 2020న జియో ప్లాట్‌ఫామ్ బోర్డులో అనంత్‌ అంబానిని డైరెక్టర్‌గా నియమించారు.