Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్, జియో సృష్టించిన సునామీ... మళ్లీ ఆసియా కుబేరుడిగా ముకేశ్ అంబానీ...

రిలయన్స్ జియోతో ఫేస్ బుక్ భాగస్వామ్య ఒప్పందం పలు రికార్డులు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆసియా ఖండంలో కుబేరుడిగా ఉన్న జాక్ మాను అధిగమించి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మళ్లీ అపర కుబేరుడిగా నిలిచారు. ఫేస్‌బుక్‌తో బంధంతో జియో దేశంలోనే అతిపెద్ద సంస్థల్లో ఐదవదిగా నిలిచింది. పలు దేశాల జీడీపీ కంటే జియో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ.
 

Mukesh Ambani Tops Jack Ma As Asia's Richest After Facebook Deal
Author
Hyderabad, First Published Apr 23, 2020, 11:58 AM IST

ఫేస్‌బుక్ , రిలయన్స్ జియో మెగా డీల్ అనేక సంచలనాలకు నాంది పలికింది. ఫేస్‌బుక్‌తో జరిగిన ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అపర కుబేరుడిగా నిలిచారు. 

బ్లూమింగ్ బిలియనీర్స్ తాజా నివేదిక ప్రకారం.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘అలీబాబా’ అధినేత ‘జాక్ మా’ను వెనక్కి నెట్టి ముఖేశ్ ఆసియాలో అత్యంత కుబేరుడిగా ఎదిగారు. బుధవారం రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లాభం 10 శాతం ముఖేశ్ అంబానీ ఆస్తి 4.7 బిలియన్ డాలర్ల నుంచి ఏకంగా 49.2 డాలర్లకు పెరిగింది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనంవతుల జాబితాలో ముఖేశ్ అంబానీ 17వ స్థానంలో ఉండగా.. జాక్ మా 19వ స్థానంలో నిలిచారు.జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు (రూ.43,574 కోట్లు) ఫేస్‌బుక్‌ కొనుగోలు చేయడమే దీనికి కారణం. 

ఈ డీల్‌  పూర్తయ్యాక ఫేస్‌బుక్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌ కానుంది. ఈ ఒప్పందానికి ముందు, 2020 లో అంబానీ సంపద 14 బిలియన్ డాలర్ల క్షీణతను చవి చూసింది. ఇది ఆసియాలో ఎవరికైనా డాలర్ పరంగా అతిపెద్ద పతనం. దీన్ని బట్టే  ఫేస్‌బుక్, జియో డీల్ సృష్టించిన సునామీని అర్థం చేసుకోవచ్చు. 

also  read  అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాక్... వాట్సాప్ ద్వారా నిత్యవసరాల డెలివరీ...

అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ మంగళవారం నాటికి ఒక బిలియన్ల డాలర్లను కోల్పోయింది. 29 ఏళ్లలో చమురు అతిపెద్ద పతనాన్ని నమోదు చేయడంతో మార్చి ప్రారంభంలో, జాక్ మా, అంబానీని అధిగమించి అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ అనువర్తనాల డిమాండ్  తగ్గడంతో జాక్ మా సారథ్యంలోని ఆలీబాబా హోల్డింగ్స్  నష్టాలను చవి చూస్తోంది.మరోవైపు రిలయన్స్ జియోలో ఫేస్‌బుక్ పెట్టుబడులతో దేశంలోనే తొలి ఐదు సంస్థల్లో ఒకటిగా జియో స్థానం సంపాదించుకుంది.

అంతేకాకుండా కొన్ని దేశాల జీడీపీ కన్నా జియో మార్కెట్ మూలధనం ఎక్కువ ఉండటం విశేషం. జింబాబ్వే జీడీపీ 19.4 బిలియన్ డాలర్లు, మారిషస్ జీడీపీ 14 బిలియన్ డాలర్లు, ఐలాండ్ జీడీపి 26.6 బిలియన్ డాలర్లు కాగా జియో కంపెనీ విలువ ఏకంగా 65.95 బిలియన్ డాలర్లు వుందని తాజా గణాంకాల ద్వారా  తెలుస్తోంది 

Follow Us:
Download App:
  • android
  • ios