రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ సంపన్నుల జాబితాలో మరో రికాన్డును సృష్టించారు. టెక్ దిగ్గజాలు ఎలన్ మస్క్, ఆల్పాబెట్ ఐఎన్‌సీ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రైన్, లారీ పేజ్‌లను సైతం వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లారు.

గత వారమే ముఖేశ్..  ప్రముఖ పెట్టిబడిదారు వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అంబానీ సంపద 72.4 బిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా టెక్ షేర్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి.

Also Read:ముఖేశ్ దూకుడు.. వారెన్ బఫెట్ వెనక్కి: ప్రపంచ కుబేరుల్లో 8వ స్థానానికి అంబానీ

షేర్ల పతనంతో లారీ పేజ్ సంపద 71.6 బిలియన్ డాలర్లకు, బ్రెయిన్స్ సంపద 69.4 బిలియన్ డాలర్లకు, టెస్లా అధినేత మస్క్ సంపద  68.6 బిలియన్ డాలర్లకు చేరింది. గత శుక్రవారం రిలయన్స్ మార్కెట్ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది.

భారత్‌లో కోవిడ్ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో రిలయన్స్ షేర్ల విలువ బాగా తగ్గింది. ఒకానొక దశలో రూ.1,000 లోపునకు వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి మెల్లగా పుంజుకున్నాయి. ఫేస్‌బుక్‌తో రిలయన్స్ ఎప్పుడైతే ఒప్పందం చేసుకుందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలయన్స్ షేర్ ధర 120 శాతం పెరిగింది.

Also Read:రిలయన్స్ 30 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం: రైట్స్ ఇష్యూకు ముఖేశ్ అంబానీ

దీనికి తోడు మార్చి 2021 నాటికి రుణరహిత సంస్థగా అవతరిస్తారని ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. ఇప్పటికే జియో ఫ్లాట్ ఫామ్స్‌లో ఫేస్‌బుక్ సహా సిల్వర్ లేక్, క్వాల్‌కాం వంటి 12 విదేశీ కంపెనీలకు 25.24 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.18 లక్షల కోట్లను సమీకరించింది.