సారాంశం

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోవిజన్ తో ఐఐటీ హైదరాబాద్ ఎంవోయూ కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పరిశ్రమ, విద్యాసంస్థల మద్య ఉన్న అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తామని  ఇన్ఫోవిజన్‌ ప్రెసిడెంట్‌  సీన్‌ యలమంచి తెలిపారు.

డిజిటల్‌ సేవలను అందించే అగ్రశ్రేణి అమెరికా కంపనీ ఇన్ఫోవిజన్‌ తాజాగా ఐఐటీ హైదరాబాద్ తో ఒప్పందం కుదుర్చుకుంది. యునైటెడ్ స్టేట్స్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ గ్లోబల్ డిజిటల్ సేవల సంస్థ అయిన ఇన్ఫోవిజన్‌,  ఫిబ్రవరి 23, 2023న IIT-హైదరాబాద్‌తో MOU సంతకం చేసింది. ఈ భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశ్యం పరిశ్రమకు, విద్యాసంస్థలకు వారధిగా ఏర్పడుతుందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా , InfoVision ప్రెసిడెంట్ సీన్ యలమంచి, IIT హైదరాబాద్ క్యాంపస్‌ని సందర్శించారు, IIT హైదరాబాద్ ఫ్యాకల్టీ, పాలక వర్గంతో పలు అంశాలను చర్చించారు. అంతేకాదు తమ భాగస్వామ్యాన్ని లాంఛనంగా ప్రకటిస్తూ.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) చొరవలో భాగంగా రెండు కొత్త హైబ్రిడ్ తరగతి గదులను సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా "ఐఐటి వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది" అని ఇన్ఫోవిజన్ సహ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్ బోర్డు సభ్యుడు మిస్టర్ సీన్ యలమంచి అన్నారు. 

సీన్ యలమంచిలి మరిన్ని విశేషాలు పంచుకుంటూ.. ఐఐటీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ కలయిక పరిశ్రమ,  విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.  ఇది పరిశ్రమలో విద్యార్థులు రియల్ టైం సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూసే అనుభవం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యావిధానం ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఒఫ్పందం ద్వారా విద్యార్థులు కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని, వర్క్‌ఫోర్స్ కోసం విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఈ ఎంవోయూ  ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 

అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్ఫో విజన్‌ డిజిటల్‌ సేవలను విస్తరించే భాగంగా పలు విద్యాసంస్థలతో ఒప్పంద కుదుర్చుకుంటోంది. ప్రస్తుతం భారత్‌లో ఐదు నగరాలు హైదరాబాద్‌, పుణె, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌లలో ఇన్ఫోవిజన్‌ తన సేవలు, అందిస్తోంది. వివిధ రంగాల్లో డిజిటలైజేషన్ కారణంగా సేవలు మరింత వేగవంతం అవుతాయని ఇన్ఫోవిజన్‌ ప్రెసిడెంట్‌  సీన్‌ యలమంచి తెలిపారు.