మైక్రోసాప్ట్ విండోస్ క్రాష్ : ప్రపంచవ్యాప్తంగా గందరగోళం
మైక్రోసాఫ్ట్ విండోలో సమస్యలు తలెత్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు సమస్యను ఎదుర్కొంటున్నాయి.
Microsaft : మైక్రోసాప్ట్ విండోస్ యూజర్స్ కు ఆందోళనకర పరిస్థితి ఎదురయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విండోస్ ఉపయోగిస్తున్న ప్రధాన సంస్థలు సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఇలా అనేక బ్యాంకులు, ఎయిర్ లైన్, మీడియా వంటి అనేక సంస్థలు మైక్రోసాప్ట్ విండోస్ సమస్యను ఎదుర్కొంటున్నాయి.
మైక్రోసాప్ట్ విండో యూజర్లకు బ్లూ స్క్రీన్ అప్ డేట్ సమస్య ఎదురయ్యింది. దీంతో గందరగోళం నెలకొంది. కొందరు యూజర్లు తమ సమస్యను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎర్రర్ సందేశాన్ని చూపిస్తూ రీస్టార్ట్ చేయమని చూపిసోందని మైక్రోసాప్ట్ విండోస్ యూజర్స్ చెబుతున్నారు.
ఈ సమస్య కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. ఇప్పటికే అమెరికాలో కొన్ని విమానాలు రద్దయ్యాయి. లండన్ స్టాక్ ఎక్చ్సేంజ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు మైక్రోసాఫ్ట్ విండోస్ సమస్య కారణంగా గందరగోళంలో పడ్డాయి.
అయితే ఇప్పటికే మైక్రోసాఫ్ట్ విండోస్ లో సమస్యను గుర్తించినట్లు క్రౌడ్ స్ట్రైక్ సిఈవో జార్జ్ కుర్ట్జ్ తెలిపారు. ఇది భద్రతా పరమైనదో, లేక సైబర్ దాడి కాదు... కేవలం కంటెంట్ అప్ డేట్ సమయంలో తలెత్తిన సమస్యగా ఆయన పేర్కొన్నారు. మాక్, లైనక్స్ వినియోగదారులకు ఈ సమస్య తలెత్తలేదని ఆయన తెలిపారు.
మైక్రోసాప్ట్ విండోస్ సమస్యను పరిష్కరించే వరకు వినియోగదారులు సహకరించాలని క్రౌడ్ స్ట్రైక్ సిఈవో సూచించారు. మైక్రోసాఫ్ట్ తమతో టచ్ లో వుందని... త్వరగా పరిష్కరిస్తామని క్రౌడ్ స్ట్రైక్ సిఈవో జార్జ్ తెలిపారు.