Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్...మైక్రోసాఫ్ట్ లో కొత్త ఉద్యోగాలు...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ స్పేస్‌లో 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
 

Microsoft has announced to invest $75 million to build a new office at Atlanta
Author
Hyderabad, First Published May 18, 2020, 3:35 PM IST

శాన్ఫ్రాన్సిస్కో: సాఫ్ట్‌వేర్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ జార్జియాలోని అట్లాంటాలో కొత్త కార్యాలయాన్ని నిర్మించడానికి 75 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ స్పేస్‌లో 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టించేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

సత్య నాదెల్లా సి‌ఈ‌ఓ ఈ సంస్థ జార్జియాలోని అట్లాంటా నగరం మిడ్‌టౌన్ ప్రాంతంలో 523,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో అట్లాంటిక్ స్టేషన్ జిల్లాలో కార్యకలాపాలను విస్తరించనుంది. 2021 వేసవిలో అట్లాంటాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.


"మైక్రోసాఫ్ట్ కార్ప్ వంటి గ్లోబల్ లీడర్ జార్జియాలో పెట్టుబ‌డులు పెట్ట‌డం మేము సంతోషిస్తున్నాము, అది కంపెనీకి మన రాష్ట్రానికి నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది" అని గవర్నర్ బ్రియాన్ పి. కెంప్ అన్నారు. ఇది ఏఐ, క్లౌడ్ సేవలపై దృష్టి పెట్టనుంది. 

also read అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా రాజీనామా...

"టెక్ కంపెనీ సంస్థ‌ల‌కు కేంద్ర‌మైన అట్లాంటాలో మేము పెట్టుబ‌డులు పెట్టడం ఆనందంగా ఉంది. అలాగే ఇక్కడ ఆవిష్కరణలకు కూడా చరిత్ర ఉంది, ఇంకా ఇది టెక్ వృద్ధికి ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా నిలిచింది" అని మైక్రోసాఫ్ట్ జనరల్ మేనేజర్ టెర్రెల్ కాక్స్ అన్నారు.

మేం తీసుకున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల సంస్థ‌కి   సాంకేతికంగా, ఆర్థికంగా మ‌రింత లాభం చేకూరుతుంది” అని టెర్రెల్ కాక్స్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

మిడ్‌టౌన్ అట్లాంటా అగ్రశ్రేణి ఆవిష్కరణలకు జిల్లాగా, టెక్ కంపెనీలకు కేంద్రంగా మారింది.మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం టెక్నాలజీ స్క్వేర్ వద్ద కోడా భవనంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios