టోక్యో: అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా తమ బోర్డుకి రాజీనామా చేయనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ సోమవారం వెల్లడించింది. జూన్ 25వ తేదీన జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో గ్రూప్ సీఈఓ మాయాయోషి గోటోతోపాటు మూడు కొత్త నియామకాలను బోర్డుకి ప్రతిపాదించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ తెలిపింది.

బోర్డు సభ్యుల సంఖ్య 13కి విస్తరిస్తుంది. చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ యెషోమోటో గోటో నియామకాన్ని బోర్డు ముందు ప్రతిపాదించనున్నది.  సెప్టెంబరులో అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. పరోపకారంపై దృష్టి పెట్టడానికి అధికారిక వ్యాపార పాత్రల నుంచి తాను తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. 

గతేడాది యునిక్లో పేరెంట్ ఫాస్ట్ రిటైలింగ్ వ్యవస్థాపకుడు తడాషి యనాయి నిష్క్రమణ తర్వాత సాఫ్ట్ బ్యాంక్ డైరెక్టర్‌గా జాక్ మా వైదొలిగారు. తడాషి యునాయి తన సొంత ఫ్యాషన్ బిజినెస్‌పై కేంద్రీకరించనున్నారు. 

also read చికెన్‌ ముక్క యమ కాస్ట్ లీ.. కిలో ఎంతంటే..?

చిప్ డిజైన్ సాఫ్ట్‌వేర్ సంస్థ కెడెన్స్ డిజైన్స్ సిస్టమ్స్ సీఈఓ లిప్ బూ టాన్, వాసేడా బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ యుకో కవామోటోలను బోర్డుకు ఎన్నుకోవడాన్ని సాఫ్ట్‌బ్యాంక్ ప్రతిపాదించనున్నది. కవామోటో ఏకైక మహిళా బోర్డు సభ్యురాలు కానుంది. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఎల్లియాట్ మేనేజ్మెంట్ సంస్థ డిమాండ్ మేరకు బోర్డులో సాఫ్ట్ బ్యాంక్ వైవిధ్యాన్ని ప్రదర్శించనున్నది. 

బోర్డు ఎక్కువగా సాఫ్ట్‌బ్యాంక్ ఇన్‌సైడర్లు, విశ్వసనీయమైన ప్రముఖులను  కలిగి ఉంటుంది. ఇందులో సౌదీ అరేబియా సావరిన్ ఫండ్ అధిపతి యాసిర్ అల్-రుమయ్యన్ డైరెక్టర్‌గా ఉన్నారు, బయటి విజన్ ఫండ్స్‌లో సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్‌దే అతిపెద్ద వాటా.

సాఫ్ట్‌బ్యాంక్ రెండవ 470 కోట్ల డాలర్లు (500 బిలియన్ యెన్లు) వాటా కొనుగోళ్లను విడివిడిగా ఆమోదించినట్లు తెలిపింది. మార్చిలో ప్రకటించిన 2.5 ట్రిలియన్ యెన్ల బైబ్యాక్ కార్యక్రమంలో భాగంగా గ్రూప్ షేర్ ధరను పెంచడానికి మార్చిలో ప్రకటించింది. సాఫ్ట్‌బ్యాంక్ తన షేర్లలో 250 బిలియన్ యెన్లకు పైగా ఏప్రిల్ చివరిలో తిరిగి కొనుగోలు చేసింది.