వాట్సాప్‌లో మెసేజ్‌ నిన్న ఒక్కసారిగా ఆగిపోయింది. ప్రజలు వాట్సాప్‌లో సందేశాలు పంపలేకపోయారు. యూజర్లు వాట్సాప్‌లో స్టేటస్ కూడా పెట్టలేకపోయారు. సాధారణ భాషలో వాట్సాప్ షట్ డౌన్ అయ్యింది. దీంతో లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు. దీనిపై టెక్నికల్ నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. 

వాట్సాప్ భారతదేశంలోనే కాకుండా యూకే, సింగపూర్, ఇటలీ, టర్కీ, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కూడా నిలిచిపోయింది. భారతదేశంలో దీని సేవ మధ్యాహ్నం సుమారు గంటన్నర పాటు నిలిచిపోయింది. సేవ నిలిపివేయబడిన తర్వాత, కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది, త్వరలోనే సమస్యను సరిద్దిదుతాం అని తెలిపింది. 

కానీ, ఇప్పటికీ దాని సర్వీసును ఉపయోగించడానికి వినియోగదారులు చాలా గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. వాట్సాప్ సర్వీస్ నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా వాట్సాప్ చాలాసార్లు నిలిచిపోయింది. అయితే, ఈసారి ఆగిపోవడానికి అధికారిక కారణం ఏదీ ఇంకా వెల్లడి కాలేదు.

సర్వర్ ఓవర్‌లోడ్ అవడమే కారణం..

అయితే దీనికి చాలా కారణాలు ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. వాట్సప్ ప్రతినిధి మాత్రం "మా వైపు సాంకేతిక లోపం కారణంగా స్వల్ప అంతరాయం ఏర్పడింది". సమస్య ఇప్పుడు పరిష్కరించబడింది, అని ఒక మెసేజ్ విడుదల చేసింది, అయితే భారీ ట్రాఫిక్ కూడా దీనికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ మెసేజింగ్ యాప్‌లో ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ WhatsApp మెసేజ్ లు పంపుతారు. కానీ, ప్రస్తుతం పండుగ సీజన్‌లో, దాని సంఖ్య చాలా పెరిగింది, ఇది సర్వర్ నిర్వహించలేక క్రాష్ అయిఉంటుందని భావిస్తున్నారు..

అయితే నిపుణులు మరో కారణం కూడా చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అక్టోబర్ 2021లో కూడా Facebook, Instagram, WhatsApp చాలా గంటలు ఆగిపోయాయి.. దీని వెనుక కారణం DNS వైఫల్యం.DNS లేదా డొమైన్ నేమ్ సిస్టమ్ ఒక వ్యక్తి రీడబుల్ హోస్ట్ పేరును సంఖ్యా IP చిరునామాగా మార్చే సేవ. DNS పని చేయకపోతే, మీ పరికరం వెబ్‌సైట్ హోస్ట్ సర్వర్‌లకు కనెక్ట్ అవదు.

కానీ, ఈ సందర్భంలో BGP రూటింగ్ లో సమస్య వస్తుంది. BGP అంటే బోర్డర్ గేట్‌వే ప్రోటోకాల్ సిస్టమ్ ఒక నెట్‌వర్క్ నుండి మరొక నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసే మార్గం. ఈ నెట్ వర్క్ అడ్జస్ట్ అయ్యే సమయంలో ఒక్కో సారి సర్వీసు డౌన్ అవుతుంది. అయితే దీనిపై అప్పట్లో కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈసారి కూడా అదే సమస్య కారణంగా అంతరాయం ఏర్పడవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ చేసిన తర్వాత కూడా సమస్య ఉండవచ్చు
ఒక్కో సారి యాప్ అప్ డేషన్ మార్పులు యూజర్లు అందరినీ ప్రభావితం చేస్తాయి. కానీ, ఇంత పెద్ద యూజర్ బేస్ ఉన్నందున, కంపెనీ ఒక్కసారిగా అప్ డేషన్ విడుదల చేయడం సాధ్యం కాదు. దీని కారణంగా, ఇది వివిధ వినియోగదారుల కోసం దశలవారీగా అప్ డేషన్ విడుదల చేస్తుంది. 

ఇలాంటి సందర్భం గతంలోనూ వచ్చింది

గత ఏడాది అక్టోబర్‌లో ఇంత పెద్ద అంతరాయం ఏర్పడింది. మెటాలోని అన్ని యాప్‌లు దీని వల్ల ప్రభావితమయ్యాయి. కంపెనీపై సైబర్ దాడి జరిగినట్లు భావించారు. కానీ, ఈ అంతరాయానికి కారణం ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని తర్వాత మెటా స్పష్టం చేసింది. డేటా సెంటర్ల మధ్య ట్రాఫిక్ కోఆర్డినేషన్ క్షీణించడంతో ప్రజలు ఫేస్‌బుక్, వాట్సాప్‌లను యాక్సెస్ చేయలేకపోయారు. దాదాపు 5 గంటల తర్వాత సర్వీసును రిస్టోర్ చేశారు.

ఔటెడ్ 2020 సంవత్సరంలో కూడా కనిపించింది. అయితే 2019 సంవత్సరంలో, రూట్ మెయింటెనెన్స్ ఆపరేషన్ కారణంగా వాట్సాప్ చాలా గంటలపాటు పనిచేయడం లేదు. ఇప్పుడు ఈసారి వాట్సాప్ ఎందుకు డౌన్ అయిందో, దానిపై కంపెనీ పూర్తి వివరాణాత్మక ప్రకటన తర్వాత మాత్రమే చెప్పవచ్చు.