Asianet News TeluguAsianet News Telugu

మైరా.. ఇది హైదరాబాదీ రోబో.. పిలిస్తే వడ్డిస్తుంది

హోట‌ల్‌లో వెయిట‌ర్‌లా ప‌నిచేసే వారిని  చూసుంటారు, కానీ వెయిట‌ర్‌లా పనిచేసే రోబోని ఎప్పుడైనా చూసారా.. అదే మైరా.. ఈ రోబోట్‌ను హైద‌రాబాద్‌ నగరానికి చెందిన విస్టాన్‌ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ తయారు చేసింది. 

meet maira hyderabads very own talking robot waiter know about it more
Author
Hyderabad, First Published Jul 20, 2021, 4:21 PM IST

మైరా.. ఇది హోట‌ల్‌లో వెయిట‌ర్‌లా ప‌నిచేసే ఒక రోబో పేరు. ఈ రోబో అలాంటి ఇలాంటి రోబో కాదు. ఈ రోబో మీకు హలో చెబుతుంది. మిమ్మల్ని మీ టేబుల్ ద‌గ్గ‌రికి తీసుకెళ్తుంది. మీతో ముచ్చ‌ట్లు పెడుతుంది. మీరు ఏం తింటారో క‌నుక్కుంటుంది. అంతేకాదు, మీరు ఆడ‌వాళ్లు అయితే ఈ రోబో త‌న వాయిస్‌ను లేడీ వాయిస్‌లా మార్చుకుంటుంది. ఒక‌వేళ చిన్నపిల్ల‌ల‌తో మాట్లాడితే ఈ రోబో వాయిస్ కూడా చిన్న‌పిల్ల‌ల వాయిస్‌లా మారిపోతుంది. మ‌రి ఈ రోబోకు మైరా అనే పేరు ఎందుకొచ్చింది..? ఈ రోబోను ఎవ‌రు త‌యారు చేశారు..? అనేగా మీ సందేహం..? అయితే ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకుందాం ప‌దండి.

మైరా (Maira) అంటే మల్టీ-సెన్సింగ్ ఇంటెలిజెంట్ రోబోటిక్ అసిస్టెంట్ అని అర్థం. ఈ ఇంటరాక్టివ్ రోబోట్‌ను హైద‌రాబాద్‌ నగరానికి చెందిన విస్టాన్‌ నెక్స్ట్‌జెన్ అనే సంస్థ తయారు చేసింది. అయితే ఈ రోబో జూబ్లీ హిల్స్‌లోని రోబో కిచెన్ లాంటిది కాదు. ఈ రోబో మొత్తం ఆరు వాయిస్‌ల‌లో మాట్లాడ‌గ‌ల‌దు. ఈ రోబో పరిసరాలను చూసేలా, అనుభూతి చెందేలా, చెప్పింది విన‌గ‌లిగేలా ప్రోగ్రామ్ చేయబడింది. అందుకే ఇది వెంట‌నే ప‌రిస‌రాల‌కు త‌గిన‌ట్లు మారిపోతుంది.

also read గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలోకి రిలయన్స్.. రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచన..

అంతేకాదు, ఈ వెయిట‌ర్ రోబో మీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. త‌ల ఆడిస్తుంది. క‌స్ట‌మ‌ర్ ఇచ్చిన ఆర్డ‌ర్ టేబుల్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే వ‌ర‌కు వినోదాన్ని పంచుతుంది. అందుకు త‌గిన‌ట్లు ఈ రోబో ముఖ‌క‌వ‌లిక‌ల‌ను క‌లిగి ఉంటుంది. ఒక కస్టమర్ ఈ రోబో ముందు నిలబడి హలో అని చెబితే అది ప్రత్యుత్తరం ఇస్తుంది. వారితో సంభాషణ ప్రారంభిస్తుంది. భారతదేశంలో ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు ఉన్న మొద‌టి రోబో ఇదేన‌ని విస్తాన్ నెక్స్ట్‌జెన్ వ్యవస్థాపకుడు రామరాజు సింగం వివరించారు.

రామ‌రాజు సింగం వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. రోబో మైరా త‌న‌ను ఏ పేరుతో పిలిచినా స్పందించేలా ప్రోగ్రామ్ చేయబడింది. అదేవిధంగా మ‌నం ఇచ్చే ఆదేశాలకు ప్రతిస్పందిస్తుంది. సమీప భవిష్యత్తులో వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లో ప్రారంభించబోయే కాన్సెప్ట్ రెస్టారెంట్ల కోసం అవ‌స‌ర‌మైన‌ మరిన్ని రోబోల త‌యారీ కోసం కంపెనీ ఆర్డర్లు అందుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios