Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి ఇండియాలోనే జరగాలి: ముఖేష్ అంబానీని కోరిన కొడుకు.. కారణం ఇదే..

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రముఖుల్లో ఒకరైన అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు. పెళ్లికి ముందు రెండు ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా జరిగాయి. అందులో ఒకటి అంబానీ కుటుంబం మూలాలున్న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో  జరగగా, రెండోది ఇటలీలో జరిగింది. 

Marriage should be in India'; It was his son who asked Mukesh Ambani, and this is the reason-sak
Author
First Published Jul 7, 2024, 11:12 AM IST | Last Updated Jul 7, 2024, 11:12 AM IST

 అత్యంత సంపన్నుడు, బిలియనీర్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లి  వేడుకలు అంగరంగ వైభవంగా గుజరాతీ సాంప్రదాయ  పద్ధతిలో జరగనున్నాయి. అయితే భారత్‌లో ఘనంగా వివాహాలు జరుపుకోవడానికి గల కారణాన్ని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రముఖుల్లో ఒకరైన అనంత్ అంబానీ ఘనంగా పెళ్లి వేడుకల్లో నిమగ్నమయ్యారు. పెళ్లికి ముందు రెండు ప్రీ వెడ్డింగ్ పార్టీలు కూడా జరిగాయి. అందులో ఒకటి అంబానీ కుటుంబం మూలాలున్న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో  జరగగా, రెండోది ఇటలీలో జరిగింది. నిశ్చితార్థం సమయంలో తన  పెళ్లికి సంబంధించి  అన్ని వేడుకలు  భారతదేశంలోనే ఉంటాయని అనంత్ అంబానీ స్పష్టం చేశారు. వివాహ వేడుక భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఉంటుందని అనంత్ తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోదీ ‘వెడ్ ఇన్ ఇండియా’ పిలుపుతో తాను స్ఫూర్తి పొందానని అనంత్ అంబానీ చెప్పారు. చాలా మంది వారి  పెళ్లి  వేడుకల కోసం విదేశాలను ఎంచుకుంటే, అనంత్ అంబానీ మాత్రం తన వివాహాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వివాహ వేడుకల్లో ఒకటిగా మార్చాలని నిర్ణయించుకున్నారు.

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం భారతదేశం ఇప్పటివరకు చూడని అతిపెద్ద రాయల్ వెడ్డింగ్‌లలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. ఈ పెళ్లి భారతీయ సంస్కృతిలో అతిపెద్ద దృశ్య విందుగా మారుతుందని భావిస్తున్నారు.

అంతేకాదు, భారత ఆర్థిక వ్యవస్థలో ఈ పెళ్లి సృష్టించే ప్రభావం చాలా పెద్దది. ముంబైలో జరిగే ఈ వివాహం ద్వారా కళాకారులు, సాంస్కృతిక టాలెంట్స్, డిజైనర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వేలాది మంది ఉపాధి పొందుతున్నారు.

పెళ్ళికి  ముందు జరిగిన వేడుకల  కోసం ఆరు నెలల పాటు లక్ష మందికి పైగా ఉపాధిని కల్పించాయి. ఇందులో కుక్‌లు, డ్రైవర్‌లు, ఆర్టిస్టులు ఇంకా  ఎంతో మంది ఉన్నారు. ఈ వేడుక స్థానిక ఆర్థిక వ్యవస్థకు అందించిన ప్రోత్సాహం అపారమైనది. జామ్‌నగర్, రాజ్‌కోట్ అలాగే  సమీప ప్రాంతాలలో పర్యాటక వృద్ధిని కూడా ఈ సంఘటనతో ప్రస్తావించాలి. 

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12న ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి  చేసుకోనున్నారు.  అయితే  పెళ్లితో పాటు మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios