ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఇటీవలికాలంలో భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సెక్యూరిటీ అలవెన్స్ మాత్రం భారీగా పెరిగింది.
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఇటీవలికాలంలో భారీగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్‌బర్గ్ సెక్యూరిటీ అలవెన్స్ మాత్రం భారీగా పెరిగింది. మార్క్ జుకర్‌బర్గ్, ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చే సెక్యూరిటీ అలవెన్స్‌ను 4 మిలియన్ డాలర్ల నుంచి 14 మిలియన్ డాలర్లకు పెంచినట్లు మెటా ప్లాట్‌ఫామ్స్ ఐఎన్‌సీ బుధవారం తెలిపింది. ‘‘ఈ పెరిగిన అలవెన్స్.. జుకర్‌బర్గ్ మొత్తం భద్రతా ప్రోగ్రామ్ ఖర్చులతో కూడుకున్నది. ఇది ప్రస్తుత పరిస్థితులలో తగినది, అవసరమైనది’’ అని మెటా ఒక ఫైలింగ్‌లో తెలిపింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల యజమానిగా మెటా.. వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించిన సంగతి తెలసిందే. మరోవైపు ఉద్యోగులు ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ (ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ) కనబరచాల్సిందేనని మార్క్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. కేవలం సిబ్బందితో పని చేయించడమే కాకుండా.. వర్క్ విషయంలో వ్యక్తిగతంగా శ్రద్ద వహించాల్సిందేనని ఉన్నతస్థాయి ఉద్యోగులకు కూడా హెచ్చరించారు. లేకపోతే సంస్థ నుంచి వెళ్లిపోవాలని పేర్కొన్నట్టుగా నివేదికలు వెలువడ్డాయి. ఈ తరుణంలో జుకర్‌బర్గ్ సెక్యూరిటీ అలవెన్స్ పెంచుతూ మెటా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. 38 ఏళ్ల జుకర్‌బర్గ్ ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో 16వ అత్యంత సంపన్న వ్యక్తిగా ర్యాంక్ పొందారు. ఆయన 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్లు పొందారు. గత సంవత్సరానికి సంబంధించిన జుకర్‌బర్గ్ పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు.
ఇక, మెటా సంస్థ మరికొంత మంది ఉద్యోగులను కూడా తొలగించేందుకు రంగం సిద్దం చేసినట్టుగా ఫైనాన్షియల్ టైమ్స్ గత వారం రిపోర్టు చేసింది. మెటా తాజా రౌండ్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నందున మల్టీపుల్ టీమ్స్ బడ్జెట్‌లను ఖరారు చేయడం ఆలస్యమవుతుందని పేర్కొంది.
