Asianet News TeluguAsianet News Telugu

ఓటు హక్కు వినియోగించుకోని అంబానీ సోదరులు...

ముంబైలోని దిగ్గజ వ్యాపార వేత్తలు సోమవారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంబానీ సోదరులు, రతన్​ టాటా, సజ్జన్​ జిందాల్​, టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బిజీ షెడ్యూల్​ వల్లే వీరంతా ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారని వారి అధికార ప్రతినిధులు స్పష్టం చేశారు.

Many corporate biggies fail to turn up for assembly polls
Author
Hyderabad, First Published Oct 22, 2019, 10:45 AM IST

ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సామాన్య జనంతో పాటు బాలీవుడ్​ తారలు, క్రికెటర్లు, ఇతర రంగాల ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.​ సాయంత్రం ఓటింగ్​​ ముగిసే సమయానికి దాదాపు 2014 ఎన్నికల్లో (63.38 శాతం) మాదిరే ఈసారీ 63శాతం పోలింగ్​ నమోదైంది.

also read ఇన్ఫోసిస్ లేఖలో "అనైతిక పద్ధతులతో " చూస్తున్నారు......

దిగ్గజ వ్యాపార వేత్తలైన రతన్ టాటా, ముకేశ్​ అంబానీ, అనిల్ అంబానీ, సజ్జన్​ జిందాల్​, టాటా​ సన్స్​ ఛైర్మన్​ ఎన్​ చంద్రశేఖరన్​ వంటి ప్రముఖులు ఓటింగ్​కు దూరంగా ఉన్నారు. బిజీ షెడ్యూల్​ వల్లే వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని వారి అధికార ప్రతినిధులు తెలిపారు. చంద్రశేఖరన్​తోపాటు జిందాల్​ సోమవారం ముంబైలో లేరని తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ట్వీట్​ చేశారు జిందాల్​. సాధారణంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ కుటుంబంతో పాటు వచ్చి ఓటు వేసే అంబానీ సోదరులు.. ఈ సారి మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేదు. ముకేశ్​, అనిల్​ అంబానీల గైర్హాజరుకు గల కారణాలు తెలియరాలేదు.

మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్​ మహీంద్రా, హెచ్​డీఎఫ్​సీ ఛీప్​ ఎగ్జిక్యూటివ్​ కెకీ మిస్త్రీ, మారికో ఛైర్మన్​ హర్ష్​ మారివాలా, మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్​ డైరెక్టర్​ పవన్​ గొయెంకా తదితరులు అసెంబ్లీ ఎన్నికల్లో పాలుపంచుకున్నారు. ఓటు వేయడం జీవితంలోని గొప్ప అనుభూతుల్లో ఒకటి అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. 

also read రికార్డుల రారాజు రిలయన్స్.. ప్రాఫిట్స్ @ రూ.11,262 కోట్లు

రేమాండ్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం సింఘానియా కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కార్పొరేట్లు కోరారు. కాకపోతే మే నెలాఖరులో ఢిల్లీలో రెండోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి మాత్రం అంబానీ సోదరులు, గౌతం ఆదానీ సహా 14మంది పారిశ్రామికవేత్తలు హాజరు కావడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios