న్యూ ఢిల్లీ: వంట గ్యాస్ ధరలు వరుసగా మూడోసారి మళ్ళీ తగ్గింది. నేడు ఢిల్లీలో ఎల్‌పిజి సిలిండర్ల ధరను యూనిట్‌కు  162.50 తగ్గించారు. చమురు మార్కెటింగ్ సంస్థలు దేశంలోని ప్రాంతాలలో వంట గ్యాస్ ధరల రేటు తగ్గింపును అమలు చేశాయి.

దీంతో ఎల్‌పిజి సిలిండర్ల ధరలు వివిధ మెట్రో నగరాల్లో  దిగి వచ్చాయి. సవరించిన  రేట్లు  ఈ రోజు నుంచే  (మే 1) నుంచే అమల్లోకి వచ్చాయి.  ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పిజి (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) సిలిండర్ ధర నేటి నుంచి రూ.744 నుండి రూ. 581.50 కు తగ్గించబడింది.

హైదరాబాదులో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ. 207 త‌గ్గి  రూ. 589.50 చేరుకుంది. కమ‌ర్షియ‌ల్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర కూడా రూ. 336 తగ్గి రూ. 988 కి చేరింది. ముంబైలో 714.50 తో  ఉన్న సిలిండ‌ర్ ధర  తాజాగా రూ. 579 చేరింది. కోల్‌కతాలో  రూ. 190 తగ్గి రూ. 584.50,  చెన్నైలో రూ .569.50 కు విక్రయించనున్నారు.

అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధ‌ర‌లు, డాలర్ మారకంలో రూపాయి విలువ ఆధారంగా  గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రలు మారుతూ వుంటాయి. ప్రతి నెల మొదటి రోజున సవరించబడే ఎల్పిజి సిలిండర్ రేట్లు గత ఆగస్టు నుండి పెరుగుతు ఉన్నాయి.

కరోనా వైరస్  లాక్ డౌన్ మార్చి 25 నుండి ప్రారంభమైనప్పటి నుండి, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎల్పిజి సిలిండర్ల నివేదించబడ్డాయి. స్థానిక డిమాండ్‌ను తీర్చడానికి తగినంత గ్యాస్ నిల్వ ఉన్నందున దేశంలో ఎల్‌పిజి సిలిండర్ల కొరత లేదని చిరు వ్యాపారులు నొక్కిచెప్పారు.