అమెరికాలో అత్యంత పేరుపొందిన, శతాబ్దాలుగా కొనసాగుతున్న రిటైల్‌ దిగ్గజ డిపార్ట్‌మెంట్ స్టోర్లలో ఒకటైన లార్డ్ & టేలర్ దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూతపడుతున్నా దుకాణాల జాబితాలో ఇది చేరింది.

మెన్స్ వేర్‌హౌస్, జోస్ ఎ. బ్యాంకుల మాతృ సంస్థ టైలర్డ్ బ్రాండ్స్ కూడా దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాయి. కరోనా కేసుల వ్యాప్తి, దుస్తుల డిమాండ్, సేల్స్ పడిపోవడంతో సంస్థ కొనుగోలుదారు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు లార్డ్‌ అండ్‌ టేలర్‌ వెల్లడించింది.

కాని మార్చిలో నిత్యవసరాల దుకాణాల మినహా ఇతర కొన్ని స్టోర్లను బలవంతంగా మూసివేయవలాసీ వచ్చింది. గత సంవత్సరం ఫ్రెంచ్ రెంటల్ వస్త్ర సంస్థ లె టోట్ ఇంక్ కొనుగోలు చేసిన లార్డ్ & టేలర్ దివాలా చట్టం కింద రక్షణ కోసం ఆదివారం వర్జీనియా తూర్పు కోర్టులో పిటిషన దాఖలు చేశారు.

also read హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్త సీఈఓగా శశిధర్ జగదీషన్.. ...

సంస్థ వెబ్‌సైట్‌లోని ఒక ప్రకటనలో అత్యంత పురాతనా అమెరికన్ డిపార్ట్‌మెంట్ స్టోర్లలో ఒకటైన కంపెనీ కొత్త యజమాన్యం కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. చాలా మంది రిటైల్ వ్యాపారుల లాగానే లార్డ్ & టేలర్ కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తికి ముందే ఆన్‌లైన్ షాపింగ్‌కు మారడంతో ఇబ్బందులు తలెత్తాయి.

గత సంవత్సరంలో దాదాపు శతాబ్దంపైగా తమ చేతుల్లో ఉన్న 11 అంతస్తుల భవనాన్ని కంపెనీ విక్రయించింది. 1826లో ఈ సంస్థ  డ్రై  గూడ్స్ స్టోర్లను స్థాపించింది. దేశవ్యాప్తంగా డజన్ల కొద్ది లార్డ్ & టేలర్ స్టోర్లు ఉన్నాయి. చాలా మంది వర్క్ ఫ్రోం హోం కి మారడంతో బట్టలు అమ్మే బ్రాండ్లు దుస్తుల సేల్స్  కోసం చాలా కష్టపడ్డాయి.

బ్రూక్స్ బ్రదర్స్, ఆన్ టేలర్ మాతృ సంస్థ కూడా దివాలా కోసం పిటిషన్ దాఖలు చేసిన వాటిలో ఉన్నాయి. ఈ సంవత్సరంలో జూలై 23 నాటికి పెద్ద, చిన్న సంస్థలతో సహా సుమారు 40 మంది రిటైల్ వ్యాపారులు దివాలా చట్టం కింద పిటిషన్ దాఖలు చేశారు.

కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి రెండు డజన్ల మంది దివాలా చట్టం కింద రక్షణ కోసం ప్రయత్నించారు.  జె క్రూ, జేసీ పెన్నీ, నైమాన్‌ మార్కస్, స్టేజ్‌ స్టోర్స్, ఎసెనా రిటైల్‌ గ్రూప్‌ మొదలైనవి వీటిలో ఉన్నాయి.