హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి శశిధర్ జగదీషన్ పేరును రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) ఆమోదించినట్లు కొన్నివార్తా వర్గాలు నివేదించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కు గత రాత్రి సెంట్రల్ బ్యాంక్ నుండి అనుమతి లభించినట్లు సమాచారం.

శశిధర్ జగదిషన్ ప్రస్తుతం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకులో హెచ్ఆర్ అదనపు డైరెక్టర్, ఫైనాన్స్ హెడ్ గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో పదవీ విరమణ చేయబోతున్న హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య పూరి స్థానంలో జగదీషన్ నియమితులవుతారు.

29 సంవత్సరాల అనుభవంతో శశిధర్ జగదీషన్ గ్రూప్ హెడ్ ఆఫ్ ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, లీగల్ & సెక్రటేరియల్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీగా పనిచేశారు.

also read బంధన్‌ బ్యాంక్‌కు వాటా విక్రయం.. 11 శాతం కుప్పకూలిన షేర్లు.. ...

అతను 1996 లో ఫైనాన్స్ ఫంక్షన్ లో మేనేజర్‌గా బ్యాంకులో చేరాడు, తరువాత 1999 లో బిజినెస్ హెడ్ - ఫైనాన్స్, 2008 సంవత్సరంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమితులయ్యాడు.

1994లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకును స్థాపించిన నాటి నుంచి బ్యాంకు‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓగా ఉన్న ఆదిత్యపురి పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌ 20తో ముగియనుంది. మరోవైపు ఈ జూలై 21-24 తేదీల మధ్య 74.2లక్షల ఈక్విటీ షేర్లను ఆదిత్య విక్రయించారు. శశిధర్‌ జగ్‌దీషన్‌ తోపాటు కైజద్‌ బరుచా, సునీల్‌ గార్గ్‌ ఈ పదవి రేసులో ఉన్న సంగతి తెలిసిందే.