LIC IPO: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) మే 4న ప్రారంభం కానుంది. మార్చి 9న ఐపీవో ఇష్యూ ముగియనుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థలో ప్రభుత్వం 3.5% వాటాను విక్రయించనుంది. 

LIC IPO : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపివో) మే 4న ప్రారంభమయ్యే అవకాశముంద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుందని ప్రభుత్వ వ‌ర్గాలు సోమవారం ప్రకటించాయి. భారతదేశంలో అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ తీసుకురావ‌డానికి గ‌త కొంత కాలంగా ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మార్చిలోనే ఎల్ఐసీ ఓపీవోకు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించాయి. అయితే, మార్కెట్ లో నెల‌కొన్న ప‌రిస్థితులు, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగ‌డం.. ఈ క్ర‌మంలోనే మార్కెట్లు మ‌రింత‌గా పతనం కావడం లాంటి కారణాలతో ఎల్ఐసీ ఐపీవో వాయిదాప‌డుతూ వ‌స్తోంది. 

అయితే, ఎట్ట‌కేల‌కు ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించి స్ప‌ష్ట‌త వ‌చ్చింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) మే 4న ప్రారంభమై మే 9న ముగుస్తుందని ప్రభుత్వ వ‌ర్గాలు సోమవారం ప్రకటించాయి. అయితే, ఈ సారి ప్ర‌క‌ట‌న‌లో కొన్ని మార్పులు క‌నిపించాయి. అంత‌కు ముందు ప్ర‌భుత్వం 5 శాతం వాటాలు విక్రయిస్తామని మొదట డ్రాఫ్ట్ పేపర్స్‌లో వెల్లడించింది. అయితే, ప్ర‌స్తుతం వివ‌రాల ప్ర‌కారం ప్రభుత్వం ఎల్ఐసీ IPO పరిమాణాన్ని 1.5 శాతం లేదా దాదాపు 9.4 కోట్ల షేర్లను తగ్గించింది. ఎల్‌ఐసీ బోర్డు ఇష్యూ పరిమాణాన్ని 3.5 శాతంగా నిర్ణ‌యించింది. కేవలం 3.5 శాతం వాటాలను మాత్రమే అమ్మి రూ.21,000 కోట్లు (22.14 కోట్ల షేర్లు) సమీకరించాలని నిర్ణ‌యానికి వ‌చ్చింది. ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 13న SEBIకి దాఖలు చేసిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)లో ప్రభుత్వం 31.62 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని ప్రతిపాదించింది. ఇది మొత్తం ఈక్విటీ షేర్లలో 5 శాతం. 

కాగా, 5 శాతం వాటా తగ్గింపుతో, LIC IPO భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద‌ది కానుందనీ, ఎల్ఐసీ ఐపీఓ సుమారు రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లు ఉంటుందని గతంలో అంచనా వేశారు. అయితే, తాజాగా భారత ప్రభుత్వం IPO కోసం అప్‌డేట్ చేయబడిన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ని దాఖలు చేసింది. కేవలం 3.5 శాతం వాటాలను మాత్రమే విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. దేశంలోనే అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసీ వ్యాల్యుయేషన్ రూ.6 లక్షల కోట్లుగా లెక్కించారు. ఇక ఎల్ఐసీ ఐపీఓలో షేర్ ధర విషయానికి వస్తే ప్రైస్ బ్యాండ్ రూ.950 నుంచి రూ.1,000 మధ్య ఉంటుందని అంచనా. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు ఈ వారం IPO కోసం ప్రైస్ బ్యాండ్‌ను ఖరారు చేయడానికి సమావేశమవుతుంది. రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను ఏప్రిల్ 27లోగా సెబీ ముందు సమర్పించనున్నట్లు తెలిపింది. LIC చట్టం ప్రకారం, పాలసీదారులకు ప్రభుత్వం 10 శాతం వరకు రిజర్వ్ చేయవచ్చు. IPO ముఖ్యంగా దాని పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకోవడానికి కేంద్రం ప్రణాళికకు కీలకమైనది. గత ఆర్థిక సంవత్సరం రూ.13,531 కోట్ల నుంచి 2022-23కి రూ. 65,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ వసూళ్లను ప్రభుత్వం అంచనా వేసింది.