హైదరాబాద్ 21 ఆక్టోబర్ 2020:  ఎల్ అండ్ టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌టిఎంఆర్ హెచ్ఎల్) ఎండీ, సీఈవో కె.వి.బి రెడ్డికి ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. 2020 సంవత్సరానికి గాను కె.వి.బి రెడ్డికి కన్ స్ట్రక్షన్ వరల్డ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గ్లోబల్ అవార్డు అందుకున్నారు.

ప్రైవేట్ రంగానికి సంబంధించి ఆయన ఈ అవార్డును పొందారు. వర్చువల్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అవార్దును అందుకున్నారు. నిర్మాణ రంగం, వ్యాపారంలో లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించిన వారికి ఈ అవార్డు ఇవ్వటం జరుగుతుంది.

also read ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుడు.. అంబానీ ఆస్తికి మించిన డబ్బును విరాళంగా ఇచ్చేవాడట.. ...

ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు తనను ఎంపిక చేసినందుకు కె.వి.బి రెడ్డి కన్ స్ట్రక్షన్ వరల్డ్ తోపాటు జ్యూరీకి కృతజ్ణతలు తెలిపారు. ఈ ఏడాది అవార్డు విజేతలకు కూడా ఆయన అభినందనలు తెలిపారు. కె.వి.బి రెడ్డి మూడున్నర దశాబ్దాలుగా ఈ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.  

 ఎల్ అండ్ టి మెట్రో రైల్ 2010లో స్థాపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రయాణికులకు గత కొన్ని సంవత్సరాలుగా రాకపోకల  సౌకర్యం అందిస్తుంది.