Asianet News TeluguAsianet News Telugu

ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి ఆ బాలివుడ్ హీరోయిన్‌కు ఉన్న సంబంధం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు అంబానీ కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలోనే అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన అంబానీ ఫ్యామిలీ, మొదటినుంచి కూడా చిత్ర పరిశ్రమతో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉంది. బాలివుడ్ పరిశ్రమకు చెందిన ఓ హీరోయిన్ తో అంబానీ కుటంబానికి కోడలు అని తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.  

know everything about tina ambani and mukesh ambanis sister in law
Author
First Published Apr 26, 2023, 4:35 PM IST

ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన అన్ని ఫంక్షన్లోనూ, బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం తరలి రావడం మనం అందరం చూస్తూనే ఉంటాము.  ముఖేష్ అంబానీ ఆంటీలియాలో నిర్వహించే అనేక ఫంక్షన్లకు బాలీవుడ్ తారాగణమంతా తరలిరావడం అన్ని న్యూస్ పేపర్లలోనూ టీవీ ఛానల్ లోనూ చూస్తూనే ఉంటాము.  అంతేకాదు  బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తో  అంబానీ కుటుంబానికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  అలాగే  షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్,  అమీర్ ఖాన్ వంటి దిగ్గజ హీరోలతో కూడా అంబానీ కుటుంబానికి చక్కటి అనుబంధం ఉంది. 

అదేవిధంగా దక్షిణాదికి చెందిన ప్రముఖ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా అంబానీ కుటుంబానికి చక్కటి అనుబంధం ఉంది.  అయితే పారిశ్రామికవేత్తలకు సినీ దిగ్గజాలకు స్నేహం ఉండడం పెద్ద విషయమేమీ కాదు.  కానీ అంబానీ కుటుంబానికి ఓ బాలీవుడ్ హీరోయిన్ తో చాలా దగ్గరి సంబంధం ఉంది. మామూలు సంబంధం కాదు ఏకంగా అంబానీ కుటుంబానికి ఆ హీరోయిన్ కోడలిగా వచ్చింది. . ఆమె మరి ఎవరో కాదు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ కావడం విశేషం. 

టీనా అంబానీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఓ దశాబ్ద కాలం పాటు వెలుగు వెలిగింది..టీనా అంబానీ అసలు పేరు టీనా మునిం.  ఆమె 1975లో మిస్ ఇండియాగా సెలెక్ట్ అయింది అనంతరం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. 1978లో బాలీవుడ్ హీరో దేవానంద్ సరసన దేశ్ పరదేశ్ సినిమాలో నటించింది. అనంతరం ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి రాజేష్ ఖన్నా,  సంజయ్ దత్, రిషి కపూర్ సహా  బాలీవుడ్ లోని దిగ్గజ హీరోలు అందరితో టీనా అంబానీ ఆడి పాడింది. 

1991లో ఆమె ధీరుభాయి అంబానీ  చిన్న కుమారుడు అనిల్ అంబానీ తో వివాహం జరిగింది.  అప్పటినుంచి ఆమె అంబానీ కోడలుగా పేరు సంపాదించింది.  వివాహం అనంతరం ఆమె చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైంది.  అయినప్పటికీ తనలోని కళాత్మక దృష్టిని మరిచిపోకుండా చిత్రకళవైపు అడుగులు వేసింది. పలు ఎన్జీవోల్లో సైతం ఆమె కలిసి పని చేసింది. 

ధీరుభాయ్ అంబానీ తదనంతరం రిలయన్స్ సంస్థ విభజన జరిగింది. ఇందులో భాగంగా పెద్దవాడైన ముఖేష్ అంబానీ కి ఆయిల్  వ్యాపారం  లభించగా,  చిన్నవాడైన అనిల్ అంబానీ కి ఎనర్జీ అదేవిధంగా టెలికాం వ్యాపారాలు లభించాయి.  అయితే కాలక్రమేనా ముకేశ్ అంబానీ వ్యాపారాలు విస్తరించాయి ప్రస్తుతమైన టెలికామ్ వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి జియో పేరిట విప్లవం సృష్టించారు.  అదే క్రమంలో చిన్నవాడైన అనిల్ అంబానీ వ్యాపారాలు మాత్రం అప్పుల పాలయ్యాయి ప్రస్తుతం ఆయన పలు వివాదాల్లో చిక్కుకోగా,  ఆయన సంస్థలు చాలావరకు దివాలా తీసాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios