అరోరా పీజీ కాలేజీలో జియో ట్రూ 5జీ సేవలు ప్రారంభం.. 5G సర్వీసుతో విద్యా రంగంలో జియో విప్లవం
భారతదేశ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు జియో ట్రూ 5G సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. వేగవంతమైన , విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించడం ద్వారా Jio True 5G, విద్యార్థులకు మెరుగైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. ,
జియో తన ట్రూ 5G సేవలను హైదరాబాద్‌లోని రామంతపూర్‌లోని అరోరా PG కాలేజ్ (MBA)లో ప్రారంభించింది. తెలంగాణాలో విద్యా సంస్థలకు 5G విస్తరించాలన్న సంకల్పంలో భాగంగా తొలుత ఈ కాలేజీ క్యాంపస్ లో జియో తన సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా జియో , అపరిమిత 5G సేవలను కళాశాలలోని అధ్యాపకులు , దాదాపు 1700 మంది విద్యార్థులు పొందే వీలు కలిగింది.
కళాశాల అధ్యాపకులు , విద్యార్థులను ఉద్దేశించి, జియో తెలంగాణ మొబిలిటీ సేల్స్ హెడ్ శ్రీ బాలాజీ బాబు కోటకొండ మాట్లాడుతూ, తెలంగాణాలో జియో 5G సేవల విస్తరణ, 5G ప్రయోజనాలు , అవకాశాల గురించి వివరించారు.
భారతదేశ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు జియో ట్రూ 5G సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. వేగవంతమైన , విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించడం ద్వారా Jio True 5G, విద్యార్థులకు మెరుగైన అభ్యాస అనుభవాన్ని అందిస్తుంది. అధ్యాపకులు ఉత్తమ పనితీరుకు దోహద పడుతుంది. తెలంగాణతో పాటు భారతదేశం అంతటా కాలేజీ క్యాంపస్‌లను డిజిటలైజ్ చేయడానికి జియో దృష్టి పెట్టింది.
ఈ ప్రారంభోత్సవానికి విద్యార్థులు, అధ్యాపకులు , సంస్థ నుండి మంచి స్పందన లభించింది. ఈవెంట్‌లో భాగంగా, జియో యూత్ పాస్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. వాణిజ్యపరంగా జియో 5G సేవలు ప్రారంభం అయ్యే వరకు ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు అపరిమిత 5G సేవలను ఉచితంగా పొందుతారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వర్చువల్ రియాలిటీ గాడ్జెట్‌లను అనుభూతి పొందారు, ఇన్‌స్టా క్షణాల కోసం ఏర్పాటు చేసిన ఫోటో బూత్‌లతో సంతోషంగా గడిపారు. కార్యక్రమంలో అరోరా పీజీ (ఎంబీఏ) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, వివిధ విభాగాల అధిపతులు, జియో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.