Asianet News TeluguAsianet News Telugu

మోడీజీ ఆదుకోండి: జెట్ పైలట్ల మొర, నిధుల కోసం ఎస్బీఐకి..

సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎవర్‌వేస్‌ మనుగడ కోసం వెంటనే రూ.1,500 కోట్లు విడుదల చేయాలంటూ జెట్ ఎయిర్‌వేస్ కోరినట్లు ట్రేడ్ యూనియన్ ఏవిటేర్స్ గిల్డ్ సోమవారం తెలిపింది. మరోవైపు 20వేల మంది సంస్థ ఉద్యోగులను కాపాడాలంటూ  1,100 పైలట్లు సభ్యులు గల ఈ ట్రేడ్ యూనియన్ ప్రధాని నరేంద్ర మోడీకి మొరపెట్టుకుంది. 

Jet Pilots Urge PM Modi To Help Save 20,000 Jobs, Ask SBI For   Funds
Author
New Delhi, First Published Apr 15, 2019, 2:57 PM IST

న్యూఢిల్లీ: సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎవర్‌వేస్‌ మనుగడ కోసం వెంటనే రూ.1,500 కోట్లు విడుదల చేయాలంటూ జెట్ ఎయిర్‌వేస్ కోరినట్లు ట్రేడ్ యూనియన్ ఏవిటేర్స్ గిల్డ్ సోమవారం తెలిపింది. మరోవైపు 20వేల మంది సంస్థ ఉద్యోగులను కాపాడాలంటూ  1,100 పైలట్లు సభ్యులు గల ఈ ట్రేడ్ యూనియన్ ప్రధాని నరేంద్ర మోడీకి మొరపెట్టుకుంది. 

ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) వెల్లడించింది. జెట్ ఎయిర్‌వేస్ ‌ను గత నెలలో నియంత్రణలోకి తీసుకున్న ఎస్బీఐ గ్రూప్ నేతృత్వంలోని రుణదాతలు.. రూ. 1500 కోట్లు వెంటనే అందించనున్నట్లు ప్రకటించారు. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని రుణదాతలతో సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ మేనేజ్‌మెంట్ సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలోనే రుణదాతలు నిధుల విడుదల చేస్తారా? లేదా అనేది తేలనుంది.

అప్పుల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్‌ను షట్‌డౌన్ కాపాడాలంటూ ఆ సంస్థ పైలట్లు, ఉద్యోగులు భారీ నిరసన చేపట్టారు. ఎస్బీఐ నేతృత్వం వహిస్తున్న కన్సర్టియం జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసే సంస్థ కోసం వేట కొనసాగిస్తోంది. 

కాగా, ఇటీవల డజన్ల కొద్దీ విమానాలను రుణదాతలు సీజ్ చేయడంతో ఇప్పుడు జెట్ ఎవర్‌వేస్ వద్ద కేవలం 7 విమానాలు మాత్రమే ఉన్నాయి. పైలట్లు, ఇంజినీర్లు, ఇతర సిబ్బందికి ఈ సంస్థ మూడు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదు. దీంతో సంస్థకు నిధులు మంజూరు చేయని ఎస్బీఐ బ్యాంక్ ముందు ధర్నా చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. 

75శాతం వాటా దక్కించుకునేందుకు బిడ్డర్లు శుక్రవారం లోపు తమ ఆసక్తిని తెలియపర్చాలని కోరింది. గత శుక్రవారం ప్రధానమంత్రి కార్యాలయంలో జెట్ ఎయిర్‌వేస్ సంస్థ సంక్షోభం సమావేశం జరిగింది. 

ఇది ఇలావుంటే, జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన పైలట్లు, ఇంజినీర్లను స్పైస్ జెట్ తక్కువ జీతాలకే తమ సంస్థలో ఉద్యోగులుగా తీసుకుంటోంది.
జెట్ ఎయిర్‌వేస్ సంస్థలో పొందిన జీతాల కన్నా 25-30శాతం తక్కువకే పైలట్లు స్పైస్ జెట్‌లో చేరుతుండగా, 50శాతం తక్కువ జీతానికే ఇంజినీర్లు కూడా అదేబాటలో పయనిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios