కరోనా నివారణకు కేంద్ర ప్రభూతం, దేశంలోని అన్నీ రాష్ట్రాలు హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేసిన్ సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ నంబర్లు ఎంతవరకు పనిచేస్తున్నాయి, ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయో తెలుసుకోవడం పై ఒక వార్తా వెల్లడైంది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తో దేశం మొత్తం పోరాడుతోంది. కొన్ని నగరాల్లో ఆసుపత్రులలో ఆక్సిజన్, బెడ్స్ దొరకక దేశంలోని చాలా ప్రాంతాల్లో గందరగోళం ఏర్పడింది.
అనేక ప్రాంతాలలో వైద్యులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి, కానీ దీనిని సోషల్ మీడియాలో చాలా మంది ఖండిస్తున్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేశాయి.
హెల్ప్‌లైన్ నంబర్లు అన్నీ కూడా గత ఏడాదిలో విడుదలయ్యాయి. అయితే ఈ నంబర్లలో కొన్ని ప్రజలకు ఉపయోగకరంగా లేవని తేలింది. ఇటీవల విడుదల చేసిన కొన్ని కరోనా హెల్ప్‌లైన్ నంబర్లు ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉన్నాయా లేదా అనే దానిపై ఒక వార్తా వెల్లడైంది.
దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు హెల్ప్‌లైన్ నంబర్లను జారీ చేసినప్పటికీ, ఈ నంబర్‌లకు కాల్ చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగం ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని రాష్ట్రాలు, నగరాల నంబర్లపై రియాలిటీ చెక్ జరిగింది.
ఈ రియాలిటీ చెక్‌లో కొన్ని నంబర్లు సరైనవని నిరూపించబడ్డాయి, కాని చాలా వరకు నంబర్ల నుండి ఎటువంటి సమాధానం లేదు. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ నంబర్లన్ని కోవిడ్ -19 నియంత్రణ, సమాచారం, అత్యవసర సహాయం కోసం చెందినవి.
also read వరుసగా 5వ రోజు దిగోచ్చిన పసిడి, వెండి ధరలు.. నేడు 10గ్రా బంగారు ధర ఎంతంటే.. ...
రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న కరోనా హెల్ప్‌లైన్ నంబర్లు
రాష్ట్రం/యుటి హెల్ప్‌లైన్ నంబర్
ఆంధ్రప్రదేశ్ 0866-2410978
అరుణాచల్ ప్రదేశ్ 9436055743
అస్సాం 6913347770
బీహార్ 104
చండీఘడ్ 9779558282
ఛత్తీస్‌ఘడ్ 077122-35091
ఢీల్లీ 011-22307145
గోవా 104
గుజరాత్ 104
హర్యానా 8558893911
హిమాచల్ ప్రదేశ్ 104
జమ్మూ 01912520982
జార్ఖండ్ 104
కర్ణాటక 104
కాశ్మీర్ 01942440283
కేరళ 0471-2552056
లడఖ్ 01982256462
లక్షద్వీప్ 104
మధ్యప్రదేశ్ 0755-2527177
మహారాష్ట్ర 020-26127394
మణిపూర్ 3852411668
మేఘాలయ 108
మిజోరం 102
నాగాలాండ్ 7005539653
ఒడిశా 9439994859
పుదుచ్చేరి 104
పంజాబ్ 104
రాజస్థాన్ 0141-2225624
సిక్కిం 104
తమిళనాడు 044-29510500
తెలంగాణ 104
త్రిపుర 0381-2315879
ఉత్తరాఖండ్ 104
ఉత్తర ప్రదేశ్ 18001805145
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona
