Stock Market Strategy: మార్చి నెల మార్కెట్లకు ఏమాత్రం అచ్చిరాలేదనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కేవలం 5 వరుస ట్రేడింగ్ సెషన్లలో రూ.10.5 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. దీంతో దేశీయ నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు ఎంత మేర మార్కెట్ క్యాప్ నష్టపోతాయా అనే నిపుణులు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ నష్టాల మార్కెట్లోనూ మంచి క్వాలిటీ స్టాక్స్ పై ఓ లుక్కేయాలని చెబుతున్నారు నిపుణులు. 

ఈ ఏడాది ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. అయితే ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ ఒత్తిడి మరింత పెరిగింది. ఫిబ్రవరి నుండి మార్కెట్‌లో క్షీణత కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా బిఎస్‌ఇలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 16 లక్షల కోట్లకు పైగా ఆవిరి అయిపోయింది. 

ఇదంతా ఒక ఎత్తయితే మార్చిలో మాత్రం కేవలం 5 ట్రేడింగ్ సెషన్లలో, మార్కెట్ క్యాప్ సుమారు 10.5 లక్షల కోట్లు క్షీణించింది. మార్కెట్‌లో ఈ స్థాయిలో పతనం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ ముందుకు వెళ్లేందుకు 15500 స్థాయి చాలా ముఖ్యం. దీని కంటే దిగువన పడితే, పతనం మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి, ఈ కరెక్షన్‌లో, దేశీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న రంగానికి చెందిన బలమైన స్టాక్‌లపై ఒక కన్నేసి ఉంచాలని నిపుణులు పేర్కొంటున్నారు. 

మార్కెట్ గరిష్ట స్థాయి నుంచి 15 శాతం క్షీణించింది
అంతర్జాతీయ మార్కెట్లతో సహా ఇతర ప్రధాన సూచీలతో పాటు భారత స్టాక్ మార్కెట్లు క్షీణిస్తూనే ఉన్నాయని ట్రస్ట్‌ప్లుటస్ వెల్త్ మేనేజింగ్ పార్టనర్ వినీత్ బగ్రీ పేర్కొన్నారు. భారత మార్కెట్లు ఇప్పుడు గరిష్ట స్థాయిల నుంచి 15 శాతం మేర క్షీణించాయి. భారతదేశం తన చమురు అవసరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. అటువంటి పరిస్థితిలో, పెరిగిన ముడి ధరలు దేశ వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటును పెంచుతాయి. సోమవారం, ముడి చమురు బ్యారెల్‌కు 138 డాలర్ల స్థాయిని తాకింది. 

ఇది ఏకంగా 14 ఏళ్ల గరిష్టంగా చెప్పుకోవచ్చు. దీని వల్ల రూపాయి పతనం కూడా భారీగా పెరుగుతోంది. అటు ద్రవ్యోల్బణం పెరుగుతోంది. అయితే, ఒక అంశం ఏమిటంటే, కోవిడ్ 19 మహమ్మారి సమయంలో చూసినట్లుగా, ప్రస్తుత సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగదని. అటువంటి పరిస్థితిలో, మార్కెట్లు దీర్ఘకాలిక నష్టాన్ని చవిచూసే అవకాశం తక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు. 

లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు అవకాశం...
మార్కెట్‌లోని జియో పొలిటికల్ ఉద్రిక్తత కారణంగా అనేక అంశాలు ప్రతికూలంగా మారుతున్నాయని ట్రేడింగో వ్యవస్థాపకుడు పార్థ్ న్యాతి చెప్పారు. ఎఫ్‌ఐఐల మార్కెట్ల నుంచి నగదు ఉపసంహరించడం, అధిక ఇంధన ధరలు, వస్తువుల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణత దీనికి ప్రధానమైనవి. అయితే ప్రస్తుతం మార్కెట్లు ఆల్ టైం గరిష్ట స్థాయి నుంచి కరెక్షన్ కు గురవుతున్నాయి. అంటే ఈ కరెక్షన్ ఒక అర్ధవంతమైన దిద్దుబాటుగానే కనిపిస్తోంది. నిజానికి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు క్వాలిటీ స్టాక్స్ కొనుగోలుకు ఇది అవకాశం.

నిఫ్టీ ఎక్కడికి వెళ్ళవచ్చు
సాంకేతికంగా ఓవరాల్ స్ట్రక్చర్ బలహీనంగా ఉందని పార్థ్ న్యాతి పేర్కొన్నారు. నిఫ్టీకి ఇప్పుడు 15500 స్థాయి వద్ద చాలా ముఖ్యమైన మద్దతు స్థాయి ఉంది. ఈ స్థాయి విచ్ఛిన్నమైతే, నిఫ్టీ 15000 స్థాయి వరకు బలహీనపడవచ్చు. మరింత కొనసాగితే నిఫ్టీ 14000 స్థాయి వరకు బలహీనపడవచ్చు. అప్ సైడ్ మాత్రం ఇప్పుడు 16300-16500 మొదటి నిరోధక స్థాయి. నిఫ్టీ దీని పైన నిలదొక్కుకుంటేనే 17000 దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు. 

ఎక్కడ పెట్టుబడి పెట్టాలి
ఇన్వెస్టర్లు మెరుగైన స్టాక్‌లపై దృష్టి పెట్టాలని పార్థ్ న్యాతి సలహా ఇస్తున్నారు. ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఐటీ రంగంలో క్వాలిటీ స్టాక్స్ కొనుగోళ్లకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఆటో రంగానికి అనుకూలమైన రిస్క్ రివార్డ్ రేషియో అందిస్తోంది. Thermax, KNR Construction, LT, SBI, ICICI Bank, Infosys, KPIT, Tata Power, Tata Motors, Minda Industries, SBI Life insurance, Bajaj Finserv, Canfin homes, Sobha, Brigade Enterprises, Kajaria Ceramics,Reliance టాప్ పిక్స్ గా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.