రోజుకు కేవలం రూ.20 పెట్టుబడితో రూ.34 లక్షలు సంపాదించండి
మీరు రోజుకు కేవలం రూ.20 పెట్టుబడి పెడితే రూ.34 లక్షలు మీ ఖాతాలో జమ అవుతాయి. అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్ లో ఏదైనా సాధ్యమే. 20 రూపాయలు రూ.34 లక్షలు ఎలా అవుతాయో తెలుసుకుందాం రండి.
డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఎవరు ఆలోచించరు చెప్పండి. వ్యాపారాలు భారీ పెట్టుబడులపై ఆధారపడి ఉంటాయి. సేవింగ్స్ చేసి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాదు. అంత పెట్టినా సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ పెట్టుబడితో లాంగ్ టర్మ్ లో అధిక రాబడి పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్
మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా చిన్న మొత్తాలను భారీగా మార్చడానికి అవకాశం ఉంటుంది. SIP పెట్టుబడులు ఇటీవల సంవత్సరాల్లో అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఇందులో రిస్క్ తక్కువ. లాభాలు ఆశించిన స్థాయిలో రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
SIPలో ఉండే గొప్ప ప్రయోజనం ఏమిటంటే దీన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. నేడు చాలా మ్యూచువల్ ఫండ్స్ రోజుకు 20 రూపాయల పెట్టుబడిని కూడా అనుమతిస్తున్నాయి. చిన్న పెట్టుబడులే సేఫ్టీ మెథడ్స్ లో కొంత కాలానికి భారీ మొత్తాలుగా మారుతాయి.
తాజా గణాంకాల ప్రకారం SIP అకౌంట్స్ సంఖ్య 10.22 కోట్లకు పెరిగింది. ఇది ఒక నెల క్రితం 10.12 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి పెట్టుబడిదారులు SIPలో పెట్టుబడి పెట్టడానికి ఎంత ఆసక్తిని చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 20 % స్టెప్ అప్‌తో SIPలో రోజుకు రూ. 20 పెట్టుబడి పెట్టండి. రోజుకు రూ.20 అంటే నెలకు రూ.600 పెట్టుబడి అవుతుంది. ఈ ఫండ్ 20 ఏళ్లలో రూ.34 లక్షలకు పెరుగుతుంది. సంవత్సరానికి రూ.7,200 పెట్టుబడికి 14 % వార్షిక రాబడిని ఆశిస్తే 20 ఏళ్లలో రూ.34 లక్షలు అవుతాయి.
నెలకు రూ.600
రోజుకు రూ.20 చొప్పున నెలకు రూ.600. సంవత్సరానికి రూ.7,200 పెట్టుబడి అవుతుంది. ఈ పెట్టుబడికి 14% వార్షిక రాబడిని ఆశించినట్లయితే మీ మొత్తం పెట్టుబడి 20 సంవత్సరాలలో రూ. 13.44 లక్షలు అవుతుంది. కాని మీరు చివరగా రూ.34 లక్షలు పొందుతారు. అంటే వడ్డీ రూపంలో రూ. 20.54 లక్షలు మీకు లభిస్తాయి. చిన్న పొదుపులతో పెద్ద లక్ష్యాలను సాధించాలనుకునే వారికి ఇది ఆదర్శవంతమైన పెట్టుబడి అవుతుంది.
రిస్క్ తీసుకొంటేనే..
అయితే SIP పెట్టుబడుల్లో కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పెట్టుబడి ఈక్విటీ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్ హెచ్చుతగ్గులు మీ రాబడిపై ప్రభావం చూపవచ్చు. SIPలో పెట్టుబడి పెట్టే ముందు రిస్క్ తీసుకోవడానికి సిద్ధమై పెట్టుబడి పెట్టాలి. భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలను ఆలోచించుకొని రిస్క్ చేయగలిగితే మంచి ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి:
పోస్టాఫీసులోనూ రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు