Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్.. సామాన్యులకు వరాల జల్లు

ఈ తాత్కాలిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం  వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు వరాల జల్లు కురిపించనున్నట్లు తెలుస్తోంది. 

Interim Budget 2019: Government may announce various sops for insurance sector
Author
Hyderabad, First Published Jan 30, 2019, 11:47 AM IST

లోక్ సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 2019-20వ ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు 14రోజులపాటు జరగనున్నాయని సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది తెలుస్తోంది.

ఈ తాత్కాలిక బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం  వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సామాన్యులకు వరాల జల్లు కురిపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసుకొని ఈ  బడ్జెట్ తయారు చేసినట్లు సమాచారం. ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడికి సొంతింటి కల ఉంటుంది. దానిని ఈ సారి బడ్జెట్ లో టార్గెట్ చేశారు.

హోం ఇన్సూరెన్స్ పై పన్ను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు ఈ ప్రతిపాదనను బడ్జెట్ లో వినిపించనున్నారు. అదేవిధంగా స్వచ్ఛమైన రక్షణ భీమా పథకాలకు పన్ను తగ్గింపు, ఇతర పెన్షన్ ఇన్సూరెన్స్ తదితర వాటిపై ట్యాక్స్ బెన్ఫిట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రభుత్వరంగ సాధారణ భీమా కంపెనీల కోసం ప్రభుత్వం రూ.4వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. నిజంగా వీటిని బడ్జెట్ లో అమలు చేస్తే.. చాలా మంది సామాన్యలకు పన్ను భారం తగ్గే అవకాశం ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios