బెంగళూరు: ఐటీ  దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రోడక్ట్‌ డిజైన్, డెవలప్‌మెంట్‌ సంస్థ కాలిడోస్కోప్ ఇన్నోవేషన్‌ను 42 మిలియన్ల డాలర్లకు(సుమారు రూ. 308 కోట్లు) కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది.

ఈ కొనుగోలుతో సంస్థ ఇంజనీరింగ్ సేవల పోర్ట్‌ఫోలియోను విస్తరించడం, యుఎస్ అంతటా వైద్య పరికరాలు, కన్జ్యూమర్, పారిశ్రామిక మార్కెట్లలో ఉనికిని బలోపేతం చేయలని  లక్ష్యంగా పెట్టుకుంది.

కాలిడోస్కోప్ మైక్రో సర్జికల్ సాధనాలు, శస్త్రచికిత్సలో ఉపయోగించే పరికరాలు, కంటి చికిత్సల కొరకు  ఔషధ పంపిణీ వస్తువులను డిజైన్ చేస్తుంది.

also read రోజుకి 9 గంటలు నిద్రపోతూ 1 లక్ష సంపాదించొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ?

ఇన్ఫోసిస్ సంస్థ గత మూడేళ్ల ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు 2019లలో  20.6 మిలియన్,  2018లలో 15.5 మిలియన్, 2017లలో 13.2 మిలియన్లుగా ఉన్నాయి.

ఈ కొనుగోలుతో కొత్త సాఫ్ట్‌వేర్ టెక్నాలజి పరిజ్ఞానాలు, వైద్య పరికరాల డిజిటల్ సమర్పణలను మరింత బలపరుస్తుంది. 2021 ఆర్థిక సంవత్సర రెండవ త్రైమాసికంలో ఈ కొనుగోలు ముగుస్తుందని భావిస్తున్నారు.