ముంబయి నగరంలో మంగళవారం జరిగిన వార్షిక టికాన్ కార్యక్రమంలో ఇద్దరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు వేదికను పంచుకున్నారు. అక్కడ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్  అవార్డును ప్రదానం చేశారు. అవార్డ్ ప్రదానం చేశాక అతనిపై ఉన్న గౌరవానికి చిహ్నంగా వంగి అతని పాదాలను తాకి నమస్కారం చేశారు.

also read Budget 2020: బడ్జెట్​లో బ్యాంకింగ్ రంగంపై ఏమైనా సంస్కరణలు తీసుకుంటుందా...?

రతన్ టాటా పాదాలకు నమస్కరించిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఫోటోలు  ప్రస్తుతం ట్విట్టర్‌ లో ట్రెండింగ్ అవుతుంది."నా స్నేహితుడు మిస్టర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్  అవార్డ్ అందుకోవడం ఇది ఒక గొప్ప గౌరవం" అని రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో రాశారు.

టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసి తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు."నా స్నేహితుడు మిస్టర్ నారాయణ మూర్తి చేతుల మీదుగా టికాన్ కార్యక్రమలో అవార్డ్ తిసుకోవడం ఒక గొప్ప గౌరవం" అని 82 ఏళ్ల రతన్ టాటాకి  73 ఏళ్ల నారాయణ మూర్తి అవార్డ్ అందించి ఆపై అతని పాదాలను  తాకి నమస్కరించే వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు.

also read మీ ఇంటిని లామినేషన్ చేయాలనుకుంటున్నారా.?

ఆ ఈవెంట్ నిర్వాహకులు కూడా ట్విట్టర్‌లో కామెంట్ పెట్టి ఆ వీడియొలు పోస్ట్ చేశారు.ట్విట్టర్‌లో చాలా మంది ఈ ఫోటోలను, నారాయణ మూర్తిని ప్రశంసలతో ముంచెత్తరు.   టికాన్ ముంబై 11వ ఎడిషన్‌లో రతన్ టాటాను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించినట్లు  ఒక వార్తా సంస్థ తెలిపింది.

" రతన్ టాటా యొక్క శాశ్వత వారసత్వం నీతి మరియు సమగ్రత యొక్క అత్యున్నత ప్రమాణాలు, ఇది రాబోయే దశాబ్దాలుగా వ్యవస్థాపకులకు వారి ప్రయాణంలో మార్గనిర్దేశం చేస్తుంది.హాల్ ఆఫ్ ఫేం అవార్డు గ్రహీత వేలాది మందికి రోల్ మోడల్, కరేజ్, ఆదర్శప్రాయమైన ధైర్యం, పాషన్, ఇంకా వేలాది మందికి ఉద్యోగ  అవకాశాలను సృష్టించారు "అని  టికాన్ ముంబై అధ్యక్షుడు అతుల్ నిషార్ అన్నారు.