Asianet News TeluguAsianet News Telugu

మీ ఇంటిని లామినేషన్ చేయాలనుకుంటున్నారా.?

ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నవారికి ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రోటెక్‌తో మరింత సులభతరం చేస్తోంది. ఇది మేలైన, మన్నికైన లామినేషన్ గార్డ్ టెక్నాలజీ ఆధారిత ఎక్స్‌టీరియర్ ఎమల్షన్ పెయింటింగ్ వ్యవస్థ.

Asian Paints presents technology that can laminate the walls of your house
Author
Hyderabad, First Published Jan 28, 2020, 3:52 PM IST

ఎండ, వాన ఇతర సహజ ప్రకృతి కారకాల నుంచి గోడలను ఎలా రక్షించుకోవాలా అన్న దానిపై ప్రస్తుత రోజుల్లో ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు అంశాల కారణంగా ఇంటి పెయింట్‌ పెచ్చులుగా ఊడిరావడమో లేదంటే మాసిపోవడమో జరిగి మొత్తం ఇంటి అందమే చెడిపోతుంది. వాతావరణ మార్పుల కారణంగా పెయింట్‌కు నష్టం కలగకుండా ఉండేందుకు గాను ఇంటిని లామినేట్ చేస్తే వెలుపలి గోడలు అందంగా, కొత్తగా కనిపిస్తాయి. 

ఇంటిని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నవారికి ఏషియన్ పెయింట్స్ అల్టిమా ప్రోటెక్‌తో మరింత సులభతరం చేస్తోంది. ఇది మేలైన, మన్నికైన లామినేషన్ గార్డ్ టెక్నాలజీ ఆధారిత ఎక్స్‌టీరియర్ ఎమల్షన్ పెయింటింగ్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఈ పెయింటింగ్ వల్ల ఖర్చు ఆదా చేయవచ్చు. ఎందుకంటే ఇది బయట గోడలను తీవ్రమైన ఎండ, అకాల వర్షాల నుంచి సురక్షితంగా ఉంచుతుంది. 

లామినేషన్ గార్డ్ టెక్నాలజీ ఆధారితంగా పనిచేసే అల్టిమా ప్రోటెక్ గోడకు మన్నికతో పాటు అందాన్ని తీసుకొస్తుంది. దీనిని ఒక్కసారి వాడితే పదేళ్ల వరకు మేలైన రక్షణను ఇస్తుందని ఖచ్చితమైన గ్యారెంటీ ఇస్తోంది. 

ఉన్నతమైన శుభ్రత, నిర్మాణాత్మక రక్షణ, క్రాక్ బ్రిడ్జింగ్ దీని యొక్క మిగిలిన ప్రత్యేకతలు. ఆసియా పెయింట్స్ అల్టిమా ప్రోటెక్ మురికి గీతలు, తుప్పు, పక్షుల మలమూత్రాలు పడిన వెలుపలి గోడలను శుభ్రం చేయడం సులభతరం చేస్తుంది. ఆసియా పెయింట్స్ అల్టిమా ప్రోటెక్ యొక్క నీటి నిరోధక సామర్ధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు సరైనవి. 

ఏషియా పెయింట్స్ అల్టిమా ప్రోకెట్ పర్యావరణ అనుకూలమైనది. ఎందుకంటే ఇది క్యాన్సర్, హెవీ లోహాలు, ఏపీఈవో‌లు లేకుండా తయారవుతుంది. అంతేకాకుండా జీఎస్-11 ప్రమాణంలో వీఓసీ నియమాలకు అనుగుణంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఇది పర్యావరణంతో పాటు ఇంట్లో నివసించే వారి ఆరోగ్యంపైనా ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించదు. 

ఇప్పుడు మీరు మీ ఇంటికి క్రొత్త రూపాన్ని ఇవ్వాలని నిర్ణయించుకుంటే దానికి పెయింటింగ్ చేసి, లామినేట్ చేయండి. 

Follow Us:
Download App:
  • android
  • ios