పారిశ్రామికవేత్త రతన్ టాటా ఈ రోజు మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్‌లోకి 10 నెలల వయసున్న సుర్ అనే కుక్క గురించి పోస్ట్ చేశారు. దీనిని ఎవరైనా దత్తత తీసుకోవాలి అనుకునే వారు అప్పీల్  చేసుకోవచ్చు అంటూ దాని ఫోటో పెట్టి పోస్ట్ చేశారు.

మిస్టర్ రతన్ టాటా, కుక్కల పట్ల తనకు ఉన్న అభిమానం చాటుకున్నాడు, పూణేలో సుర్ అనే కుక్క యజమాని కుటుంబాన్ని కనుగొనడం కోసం తన 1.3 మిలియన్ల మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని కోరారు.

 దానిని దత్తత తీసుకోడానికి ఒక ఫార్మ్ తో పాటు, అతను సుర్ ఫోటోను కూడా పంచుకున్నాడు, ఈ ఫోటోని వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

also read ఆర్‌బి‌ఐ హామీతో ఊపందుకున్న యెస్ బ్యాంక్ షేర్లు...

"చాలా మంది దాని యజమానులు మారిన తరువాత,  ఇప్పుడు 'సుర్'(కుక్క పేరు)ను చూసుకోవటానికి ఒక కుటుంబం లేదు" అని 82 ఏళ్ల మిస్టర్ టాటా పోస్టులో రాశారు. 

మిస్టర్ టాటా తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీనిని షేర్ చేసిన తరువాత  మైరా అనే లాబ్రడార్ గురించి మాట్లాడుతూ తన పోస్ట్‌ను ముగించారు.

 చివరిసారి, మైరా(కుక్క పేరు)ను పెంచుకుంటున్న ఫ్యామిలిని గుర్తించడానికి మీరందరూ నాకు సహాయం చేసారు ఇప్పుడు కూడా సుర్ కోసం మీరు అదే చేస్తారని నేను ఆశిస్తున్నాను అని అన్నారు.

also read బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపు... ఏప్రిల్ 3న నిర్ణయం...

సుర్‌ అడప్ట్ చేసుకోవడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం ఒక ఫారమ్‌ లింక్‌ కూడా షేర్  చేశారు. అయితే దయచేసి రతన్ టాటా దృష్టిని ఆకర్షించడానికి సుర్ ను దత్తత తీసుకోవడానికి ప్రయత్నించవద్దు  అని ఫారంలో ఒక చిన్న హెచ్చరిక కూడా రాశారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసినప్పటి నుండి సుర్ కోసం దత్తత అప్పీల్ చేసుకోవడానికి వందలాది కామెంట్లను సంపాదించింది."మీరు చాలా అద్భుతం సార్" అని మరొకరు "ఆమె(కుక్క) చాలా అందంగా ఉంది" అని కామెంట్స్ రాశారు.

మిస్టర్ టాటాకు కుక్కల పట్ల ఉన్న అభిమానం అందరికీ తెలిసిందే. గత ఏడాది అక్టోబర్‌లో సోషల్ మీడియాలో చేరిన కొద్దికాలానికే తన కుక్క టిటో జయంతి సందర్భంగా ఆయన ఒక ఫోటో పంచుకున్నారు.